రజనీతో అవకాశం.. లారెన్స్‌ ఏం చేస్తాడో? | Rajinikanth 170th Movie With Lawrence News Virali In Kollywood | Sakshi
Sakshi News home page

రజనీతో అవకాశం.. లారెన్స్‌ ఏం చేస్తాడో?

Published Sat, Mar 21 2020 5:29 PM | Last Updated on Sat, Mar 21 2020 5:29 PM

Rajinikanth 170th Movie With Lawrence News Virali In Kollywood - Sakshi

సౌతిండియా సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఒక చిత్రం రూపొందుతుండగానే మరో చిత్రాన్ని లైన్లో పెడుతున్నాడు ఈ సూపర్‌ స్టార్‌. ‘దర్బార్‌’తర్వాత శివ దర్శకత్వంలో రజనీ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. ఇక ఈ సినిమా అనంతరం ఖైదీ, మాస్టర్‌ చిత్రాల ఫేమ్‌ లోకేశ్‌ కనకరాజ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా ఉంటుంది. ఈ చిత్రాన్ని కమల్‌హాసన్‌ నిర్మాణసంస్థ నిర్మించడం విశేషం. అయితే తాజాగా రజనీ తన 170వ చిత్ర అవకాశం ప్రముఖ కొరియోగ్రఫర్‌, దర్శకుడు రాఘవ లారెన్స్‌కు దక్కినట్టు తెలుస్తోంది.
    

సూపర్‌స్టార్‌కు వీరాభిమాని అయిన లారెన్స్‌ ఆయనకు తరుచూ కథలు వినిపించే వాడని టాక్‌. అయితే ఈ మధ్య చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చడంతో ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న రజనీ.. ఆ తర్వాత లారెన్స్‌ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని సమాచారం. ఈ గ్యాప్‌లో పూర్తి స్క్రిప్ట్‌ను సిద్దం చేసే పనిలో పడ్డాడు లారెన్స్‌. సూపర్‌స్టార్‌ను దృష్టిలో పెట్టుకొని బలమైన కథను రాసుకున్నాడని కోలీవుడ్‌ టాక్‌. రజనీ వీరాభిమాని అయిన లారెన్స్‌ తన అబిమాన హీరోను తెరపై ఏ విధంగా చూపిస్తాడో వేచి చూడాలి. 

చదవండి:
ట్రోల్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన కనిక!
బోయపాటి చిత్రంలో బాలయ్య లుక్‌.. అదుర్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement