రజనీకాంత్, వేద్
స్టైలు స్టైలులే నీది సూపర్ స్టైలులే అని రజనీకాంత్ సూపర్ స్టైల్‌ని చాలామంది మెచ్చుకుంటారు. అద్దం ముందు నిలబడి చిన్నపిల్లలు రజనీ స్టైల్స్ చేసి చూసుకుంటారు. ఇక కుర్రకారు గురించి చెప్పక్కర్లేదు. రజనీలా వాకింగ్, రజనీలా టాకింగ్, సిగరెట్ అలవోకగా విసిరి, నోటితో క్యాచింగ్.. ఇలా చాలా చాలా చేస్తారు. బయటవాళ్లే ఇంత చేస్తే ఇక ఇంట్లో ఉన్న మనవడు ఊరుకుంటాడా? తాతను ఫాలో అయిపోతున్నాడు. రజనీకాంత్ రెండోకుమార్తె సౌందర్య కొడుకు వేద్ తాత స్టైల్‌ని గమనిస్తుంటాడట. ‘పేటా’లో తాత నిలబడినట్లు.. రెండు చేతులను జేబులో పెట్టుకుని నిలబడినప్పుడు మురిసిపోయిన సౌందర్య ఫొటో తీశారు. ఇక్కడ మనం చూస్తున్న ఫొటో అదే. వేద్ స్టైల్ చూస్తుంటే తాతకు తగ్గ మనవడు అనాలనిపిస్తోంది కదూ.
Comments
Please login to add a commentAdd a comment