మళ్లీ సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గెటప్‌లోనేనా? | rajinikanth once again in kabali getup | Sakshi
Sakshi News home page

మళ్లీ సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గెటప్‌లోనేనా?

Published Mon, Apr 17 2017 6:49 AM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM

మళ్లీ సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గెటప్‌లోనేనా?

మళ్లీ సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గెటప్‌లోనేనా?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గెటప్‌లో కనిపించనున్నారా? ఇందుకు కోలీవుడ్‌ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తోంది. రజనీకాంత్‌ ప్రేక్షకుల్ని, ముఖ్యంగా ఆయన అభిమానుల్ని ఎలాంటి గెటప్‌లోనైనా అలరిస్తారు. ఆయన గెటప్‌ల కంటే స్టైల్‌నే అభిమానులు ఇష్టపడాతారన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు చిన్న ఉదాహరణ కబాలి. అందులో రజనీకాంత్‌ సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గెటప్‌లో కనిపిస్తారు. చిత్రంలో ఎక్కువగా వయసు మళ్లిన పాత్రలోనే నటించారు. అయినా ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి పండగ చేసుకున్నారు.

తాజాగా శంకర్‌ దర్శకత్వంలో 2.ఓ చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్‌ తదుపరి కబాలి–2లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. కబాలి ఫేమ్‌ రంజిత్‌నే దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని రజనీకాంత్‌ అల్లుడు, నటుడు ధనుష్‌ తన వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై భారీ ఎత్తున్న నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న కబాలి–2 చిత్ర షూటింగ్‌ ప్రారంభానికి గడువు దగ్గర పడింది. వచ్చే నెలలోనే చిత్రం సెట్‌ పైకి వెళ్లనుందన్నది తాజా సమాచారం.

ఇందులో రజనీకాంత్‌కు జంటగా నటి విద్యాబాలన్‌ నటించే అవకాశం ఉంది. ఇందులోనూ రజనీకాంత్‌ సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గెటప్‌లో కనిపించనున్నారట. అయితే కబాలి చిత్రంలో కంటే ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో గెటప్‌ కోసం పలు డిజైన్లను రెడీ చేస్తున్నారు. అందులో చాలా కొత్తగా ఉండే గెటప్‌ను ఎంపిక చేయనున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉందంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement