ఆ చిత్రంలో రకుల్‌ ఉంటుందా? | rakul in Selvaraghavan direction? | Sakshi
Sakshi News home page

ఆ చిత్రంలో రకుల్‌ ఉంటుందా?

Published Mon, May 29 2017 2:31 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

ఆ చిత్రంలో రకుల్‌ ఉంటుందా? - Sakshi

ఆ చిత్రంలో రకుల్‌ ఉంటుందా?

నటుడు విశాల్‌ చిత్రం తుప్పరివాలన్‌ నుంచి వైదొలగిన నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తాజాగా సెల్వరాఘవన్‌ చిత్రానికి గుడ్‌బై చెప్పనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌. టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌. అయితే కోలీవుడ్‌లో మాత్రం ఇంకా విజయాల ఖాతాను ఓపెన్‌ చేయలేక పోయింది. తాజాగా ఇక్కడ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం కార్తీకి జంటగా ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా విశాల్‌కు జంటగా తుప్పరివాలన్‌ చిత్రంలో నటించడానికి సమ్మతించి ఆ తరువాత వైదొలగింది.

కాగా దర్శకుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్య సరసన నటించడానికి రకుల్‌ఎంపికైంది. సెల్వరాఘవన్‌ ప్రస్తుతం సంతానం హీరోగా మన్నవన్‌ వందానడీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికి 35 శాతం షూటింగ్‌ మాత్రమే పూర్తి చేసుకుందని సమాచారం. చిత్రాన్ని పూర్తి చేయడానికి మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉందట. అదే విధంగా నటుడు సూర్య ప్రస్తుతం విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో తానాచేర్నద కూటం చిత్రంలో నటిస్తున్నారు.

ఇందులో కీర్తీసురేశ్‌ నాయకి. ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని సమాచారం. దీంతో సూర్య తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. దర్శకుడు సెల్వరాఘవన్‌ కోసం సూర్యతో పాటు నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి. అయితే ఆ అమ్మడికి తెలుగులో చాలా అవకాశాలు వస్తున్నాయట. వాటిని వదులుకుని సెల్వరాఘవన్‌ చిత్రం కోసం ఎదురు చూసేంత సీన్‌ లేదని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం నుంచి వైదొలిగే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement