
టాలీవుడ్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, ఆరడుగుల ఆజానుబాహుడు దగ్గుబాటి రానా డేటింగ్‌లో ఉన్నారని ఎన్నోవార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే తమది స్నేహం మాత్రమేనని, అంతకుమించి ఏమీ లేదని గతంలోనే వీళ్లిద్దరూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాక ఇప్పటివరకు తనకు ఎలాంటి లవ్ ట్రాక్ లేదని, ఇంకా సింగిల్‌గానే ఉన్నానంటోంది రకుల్. దీనికి కారణం తన తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ అని అతనివైపు వేలెత్తి చూపుతోంది. ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ అక్కా తమ్ముళ్లిద్దరూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. (నా జీవితంలో ఎప్పుడు ఇన్ని రోజులు ఇంట్లో ఉండలేదు)
ముందుగా రకుల్ మాట్లాడుతూ.. "నా చిన్నతనంలో స్కూలులో అబ్బాయిలతో మాట్లాడదామనుకుంటే చాలు వెంటనే వెళ్లి ఇంట్లో నాపై ఫిర్యాదు చేసేవాడు. ఒకరోజైతే.. నేను ప్లేటు పట్టుకుని ఓ అబ్బాయి పక్కన ఊరికే నిలుచున్నా.. అంతే, అది చూసిన తమ్ముడు పేరెంట్స్ దగ్గరకు వెళ్లి అతనికి నేను తినిపిస్తున్నానని చాడీలు చెప్పాడు. అతనివల్లే అన్నీ కోల్పోయి.. ఇప్పటికీ సింగిల్‌గా ఉన్నా" అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. అమన్ మాట్లాడుతూ.."అవును.. స్కూలు లైఫ్‌లో అక్క ఏమీ చేయనీయకుండా చేశాను. కానీ అప్పుడు అలా చేసుండాల్సింది కాదేమో అనిపిస్తోంది" అన్నాడు. కాగా ప్రస్తుతం రకుల్ అటు సినిమాలతోపాటు బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. (లక్ష మందికి ఉపాధి:విజయ్ దేవరకొండ)
Comments
Please login to add a commentAdd a comment