
ఫిట్‌నెస్ అంటే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తరువాతే ఎవరిదైనా. అయితే ఈ బాడీ ఫిట్‌నెస్‌పై ప్రతీ హీరో దృష్టిసారించారు. మన టాలీవుడ్‌లో అల్లు అర్జున్, ప్రభాస్, రానా, రామ్ చరణ్‌లాంటి స్టార్లు ఫిట్‌గా కనిపిస్తారు.
వినయ విధేయ రామ కోసం మళ్లీ బాడీని బిల్డప్‌చేసిన రామ్ చరణ్.. ట్రైలర్‌లో తన విశ్వరూపాన్ని చూపాడు. ముఖ్యంగా చెర్రీ బాడీని హైలెట్ చేస్తూ.. పచ్చబొట్టుతో ఉన్న సన్నివేశాలు హైలెట్‌గా నిలిచాయి. అయితే ఇలా బాడీని బిల్డప్ చేసుకోవడానికి చేయాల్సిన పనులు, పాటించాల్సిన సూచనలు తెలుపుతూ.. బీపాజిటివ్ మ్యాగజైన్ కవర్‌పై వేసిన చెర్రీ పిక్ హైలెట్ అవుతోంది. నా దేహం-నా దేవాలయం అంటూ రామ్ చరణ్ కొటేషన్ కూడా వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment