చెర్రీ ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ ఎప్పుడంటే..? | Ram Charan Boyapati Srinu Movie Teaser And First Look Date Announced | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 5 2018 3:39 PM | Last Updated on Mon, Nov 5 2018 7:03 PM

Ram Charan Boyapati Srinu Movie Teaser And First Look Date Announced - Sakshi

రంగస్థలం లాంటి బ్లాక్‌ బస్టర్‌హిట్‌ తరువాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మాస్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రషూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్‌ వచ్చేసింది. 

షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి రామ్‌చరణ్‌కు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను గానీ, టైటిల్‌ను గానీ విడుదల చేయని చిత్రయూనిట్‌ ఈ దీపావళికి అభిమానులను ఖుషీ చేయబోతోంది. నవంబర్‌ 6 మధ్యాహ్నం ఒంటి గంటకు చెర్రీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను, టీజర్‌ను నవంబర్‌ 9 ఉదయం 10:25 గంటలకు విడుదలచేయనున్నట్లు ప్రకటించారు. కియారా అద్వాణీ, స్నేహ, జీన్స్‌ ఫేమ్‌ ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement