స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సెట్స్‌లోనే జరుపుకుంటారట రామ్‌చరణ్. జెండా వందనం యూనిట్ సభ్యులతోనే. ఎందుకంటే ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కొత్త షెడ్యూల్ ఈ రోజు నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ‘‘మా చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ ఈ రోజు నుంచి హైదారాబాద్‌లో స్టార్ట్ కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.
ఈ షెడ్యూల్‌లో ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలతో పాటుగా కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను అనౌన్స్ చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
సెట్‌లో వందనం
Published Wed, Aug 15 2018 1:54 AM | Last Updated on Wed, Aug 15 2018 1:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment