గతాన్ని గుర్తు చేస్తున్న చెర్రీ | Ram Charan Rangasthalam 1985 Location Stills | Sakshi
Sakshi News home page

గతాన్ని గుర్తు చేస్తున్న చెర్రీ

Published Sat, Oct 21 2017 3:13 PM | Last Updated on Sat, Oct 21 2017 3:13 PM

Ram Charan Rangasthalam 1985 Location Stills

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, ఆది, వైభవ్, అనసూయలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చరణ్... సైరా నరసింహారెడ్డి నిర్మాణ పనుల్లోనూ బిజీగా ఉండటంతో రంగస్థలం షూటింగ్ కాస్త నెమ్మదిగా సాగుతోంది.

తాజాగా ఈ సినిమాకు  సంబంధించిన లోకేషన్ స్టిల్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. పీరియాడిక్ సినిమా కావటంతో అప్పటి వాతావరణాన్ని కళ్లకు కట్టేందుకు అద్భుతమైన సెట్స్ రూపొందించారు. తోట తరణి ఆధ్వర్యంలో రూపొందిన ఈ సెట్స్ అప్పటి పల్లె వాతావరణాన్ని ఈ తరానికి పరిచయం చేయనున్నాయి. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న రంగస్థలం 1985 సినిమాను 2018 జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement