మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్రయూనిట్ ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. సంక్రాంతి అని కొద్ది రోజులు, తరువాత డిసెంబర్ లోనే రిలీజ్ అవుతుందని కొద్ది రోజులు ప్రచారం జరిగింది. కొద్ది రోజులుగా ఈ సినిమాను వేసవికి వాయిదా వేశారన్న టాక్ వినిపిస్తోంది. అయితే రిలీజ్ విషయంలో క్లారిటీ లేకపోయినా.. రంగస్థలం భారీగా బిజినెస్ చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
పీరియడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, ఆది పినిశెట్టి, వైభవ్, అనసూయలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిమాకు సంబంధించి ఇప్పటికే 35 కోట‍్లకు పైగా బిజినెస్ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. తెలుగు శాటిలైట్, డిజిటల్ హక్కులు 20 కోట్ల వరకు ధర పలికాయట. అలాగే హిందీ ప్రసార హక్కులు 10 కోట్లకు పైగా అమ్ముడయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆడియో హక్కులకు మరో కోటిన్నర వరకు రాగా మొత్తం కలిపి 35 కోట్ల వరకు ఉంటుందంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతానికి రంగస్థలం 1985 బిజినెస్‌కు సంబందించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. అబిమానులు మాత్రం భారీగా బిజినెస్ జరుగుతోందని సంబరపడిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment