
ఛోటా రాజన్ ఇంత 'ఛోటా'నా?
ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే కాంట్రవర్సీ కింగ్ 'రామ్ గోపాల్ వర్మ' మరోసారి తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. ఈసారి ఆయన.. ఇటీవల పట్టుబడిన మాఫియా డాన్ 'ఛోటా రాజన్'పై కాన్సంట్రేట్ చేశారు. ఇద్దరు పోలీసుల మధ్యలో ఉన్న ఛోటా రాజన్ ఫొటో ఒకదాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేసి 'ఛోటా రాజన్ ఇంత ఛోటా అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు.. ' అంటూ రాజన్ ఎత్తును ఉద్దేశిస్తూ హాస్యాస్పదమైన కామెంట్ రాశారు.
ఇదివరకే వర్మ.. ప్రముఖ రాజకీయ నాయకులు, పోలీస్ ఆఫీసర్లు, వ్యాపారవేత్తలలో ఛోటా రాజన్ ఎవరెవరి పేర్లు బయట పెడతాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Never thought Chota Rajan can become so Chota pic.twitter.com/uoZGP6S3ug
— Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2015