‘మూడు పెళ్లిళ్లపై నేను మాట్లాడలేదు’
హైదరాబాద్: తనపై వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఒక అభిమానిగా పవన్ పై ఉన్న అంచనాలతోనే మాట్లాడాను కానీ, ఎప్పుడు పవన్ చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించి కామెంట్ చేయలేదని అన్నారు. తన జీవితం, తన జీవన విధానం.. తన ఆలోచనా విధానాన్ని దాచుకోకుండా మొత్తం ‘నా ఇష్టం’ పుస్తకంలో విపులంగా రాశానని చెప్పుకొచ్చారు.
‘వాళ్లింట్లో వారి గురించి మాట్లాడారని యండమూరిని తిట్టారు. మరి వాళ్లు వేరే వాళ్ల గురించి మాట్లాడొచ్చా? ఇదేనా వికాసమ’ని వర్మ ప్రశ్నించారు. తాను పవన్ పై ఇష్టంతో మాట్లాడాను గానీ విమర్శించడానికి కాదని ఆయన తెలుసుకోకపోవడం తన దురదృష్టమని ట్విటర్ లో వాపోయారు. పవన్, ఆయన కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ, అభిమానులందరూ బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. పవన్ మీడియాతో మాట్లాడుతూ... రాంగోపాల్ వర్మ అశ్లీలచిత్రాల చూస్తారని కామెంట్ చేశారు.