personal comments
-
మన నాయకుడిని తిట్టేస్థాయికి ఆ నాయకుడు ఎదిగారా.. మన నాయకుడు ఆయన స్థాయికి
మన నాయకుడిని తిట్టేస్థాయికి ఆ నాయకుడు ఎదిగారా.. మన నాయకుడు ఆయన స్థాయికి దిగజారారా? అర్థం కావడం లేద్సార్! -
‘మూడు పెళ్లిళ్లపై నేను మాట్లాడలేదు’
హైదరాబాద్: తనపై వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఒక అభిమానిగా పవన్ పై ఉన్న అంచనాలతోనే మాట్లాడాను కానీ, ఎప్పుడు పవన్ చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించి కామెంట్ చేయలేదని అన్నారు. తన జీవితం, తన జీవన విధానం.. తన ఆలోచనా విధానాన్ని దాచుకోకుండా మొత్తం ‘నా ఇష్టం’ పుస్తకంలో విపులంగా రాశానని చెప్పుకొచ్చారు. ‘వాళ్లింట్లో వారి గురించి మాట్లాడారని యండమూరిని తిట్టారు. మరి వాళ్లు వేరే వాళ్ల గురించి మాట్లాడొచ్చా? ఇదేనా వికాసమ’ని వర్మ ప్రశ్నించారు. తాను పవన్ పై ఇష్టంతో మాట్లాడాను గానీ విమర్శించడానికి కాదని ఆయన తెలుసుకోకపోవడం తన దురదృష్టమని ట్విటర్ లో వాపోయారు. పవన్, ఆయన కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ, అభిమానులందరూ బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. పవన్ మీడియాతో మాట్లాడుతూ... రాంగోపాల్ వర్మ అశ్లీలచిత్రాల చూస్తారని కామెంట్ చేశారు. -
వ్యక్తిగత దూషణలకు దిగిన అచ్చెన్నాయుడు
హైదరాబాద్ : శాసనసభలో మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి నోరు పారేసుకున్నారు. రుణమాఫీపై సభలో సోమవారం చర్చ జరుగుతున్న సందర్భంగా ఆయన వ్యక్తిగత దూషణలకు దిగారు. సభాపక్ష నేత వైఎస్ జగన్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతుల రుణమాఫీ మీద మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. రాష్ట్రంలో ఇబ్బందులను రైతులు అర్థం చేసుకున్నారన్నారు. ఒక్క రైతుగాని, ఒక్క డ్వాక్రా మహిళగాని రుణాల మాఫీ గురించి తమను అడగటం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. ముఖ్యంత్రి చంద్రబాబు హామీలను అమలు చేస్తారని నమ్మకంతో ఉన్నారన్నారు. మంత్రి వ్యక్తిగత దూషణలకు దిగటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి తమ నిరసన తెలిపారు.