వ్యక్తిగత దూషణలకు దిగిన అచ్చెన్నాయుడు | Atchannaidu comments on andhra pradesh assembly | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత దూషణలకు దిగిన అచ్చెన్నాయుడు

Published Mon, Dec 22 2014 12:51 PM | Last Updated on Fri, Jul 12 2019 4:25 PM

వ్యక్తిగత దూషణలకు దిగిన అచ్చెన్నాయుడు - Sakshi

వ్యక్తిగత దూషణలకు దిగిన అచ్చెన్నాయుడు

హైదరాబాద్ : శాసనసభలో మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి నోరు పారేసుకున్నారు. రుణమాఫీపై సభలో సోమవారం చర్చ జరుగుతున్న సందర్భంగా ఆయన వ్యక్తిగత దూషణలకు దిగారు. సభాపక్ష నేత వైఎస్ జగన్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతుల రుణమాఫీ మీద మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. రాష్ట్రంలో ఇబ్బందులను రైతులు అర్థం చేసుకున్నారన్నారు.

ఒక్క రైతుగాని, ఒక్క డ్వాక్రా మహిళగాని రుణాల మాఫీ గురించి తమను అడగటం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. ముఖ్యంత్రి చంద్రబాబు హామీలను అమలు చేస్తారని నమ్మకంతో ఉన్నారన్నారు. మంత్రి వ్యక్తిగత దూషణలకు దిగటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి తమ నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement