
వీరప్పన్ మహాత్ముడైతే... గాంధీజీ ఏంటి?
గందపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితం ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఓ ముఖ్య పాత్ర పోషించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రాన్ని ఆపాలంటూ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి కేసు పెట్టారు. ‘‘లంచగొండి ప్రభుత్వం, అవినీతిమయమైన అటవీ శాఖ నుంచి అడవిని కాపాడటానికి తన జీవితాన్నే మా ఆయన ధారపోశాడు. చాలా మంది తమిళులు అతన్ని దైవంలా భావిస్తారు.
అలాంటి వ్యక్తిని ఓ చెడ్డవాడిగా చిత్రీకరించడం చాలా దారుణం’’ అని ముత్తులక్ష్మి పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘‘ఏ తల్లికైనా తన బిడ్డ మంచివాడిగానే కనిపిస్తాడు. ప్రతి భార్య తన భర్త మంచివాడే అనుకుంటుంది. అందులో తప్పులేదు. నా ప్రశ్నేంటంటే ఒసామా బిన్ లాడెన్, వీరప్పన్ మహాత్ములైతే... మరి గాంధీజీ ఏంటి?’’ అని తనదైన శైలిలో ముత్తులక్ష్మి వ్యాఖ్యలకు రాంగోపాల్‌వర్మ స్పందించారు.