వెన్నులో వణుకు పుట్టింది! | Ram 'Pandaga Chesko' Movie will be released on Friday | Sakshi
Sakshi News home page

వెన్నులో వణుకు పుట్టింది!

Published Wed, May 27 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

వెన్నులో వణుకు పుట్టింది!

వెన్నులో వణుకు పుట్టింది!

‘‘నేనేదైనా సినిమా ఒప్పుకున్నానంటే, అందులోని పాత్ర నా మనసుకి విపరీతంగా నచ్చాలి. ఖాళీగా ఇంట్లో కూర్చున్నా ఫర్వాలేదు.. నచ్చని సినిమా చేసి బాధపడటమెందుకు? అనుకుంటాను’’ అని సోనాల్ చౌహాన్ అంటున్నారు. రామ్ సరసన ఆమె నటించిన ‘పండగ చేస్కో’ శుక్రవారం విడుదల కానుంది.
 
 ఈ సందర్భంగా సోనాల్ మాట్లాడుతూ, ‘‘ఈ చిత్రంలో నేను ఎన్నారై యువతిగా నటించాను. పొగరుబోతు. పెత్తనం చెలాయిస్తుంది. నా మనస్తత్వానికి విరుద్ధంగా ఉన్న ఈ పాత్ర చేయడం ఓ సవాలే. అలా ఈ సినిమా నాకు నటిగా సంతృప్తిని మిగిల్చింది. అలాగే, మర్చిపోలేని సంఘటన ఒకటుంది. పోర్చుగల్‌లోని అల్గార్‌లో ఓ పెద్ద కొండ దగ్గర పాట తీశాం. ఆ కొండ మీద డాన్స్ చేయాలన్నమాట. కొండ మీద నుంచి కిందకి చూస్తే, 150 అడుగుల లోతు ఉంది.
 
 పైగా బలమైన గాలి. వెన్నులో వణుకు పుట్టింది. ఆ గాలికి నా ప్రాణం గాల్లో కలిసిపోతుందేమో అనిపించింది. అదే కొండ మీద రామ్ నన్ను కూర్చోబెట్టుకుని డాన్స్ చేసే సీన్ తీసినప్పుడు కూడా భయపడ్డాను’’ అన్నారు. ప్రస్తుతం అనుష్క నటిస్తున్న ‘సైజ్ జీరో’తో పాటు కల్యాణ్ రామ్ ‘షేర్’లో చేస్తున్నానని సోనాల్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement