రమేశ్‌వర్మ నాకో మంచి సినిమా ఇచ్చారు - నాగశౌర్య | Ramesvarma phenomenal gave a good film - nagasaurya | Sakshi
Sakshi News home page

రమేశ్‌వర్మ నాకో మంచి సినిమా ఇచ్చారు - నాగశౌర్య

Published Mon, Jan 4 2016 11:49 PM | Last Updated on Sun, Sep 3 2017 3:05 PM

రమేశ్‌వర్మ నాకో మంచి సినిమా ఇచ్చారు - నాగశౌర్య

రమేశ్‌వర్మ నాకో మంచి సినిమా ఇచ్చారు - నాగశౌర్య

 ‘‘అబ్బాయితో అమ్మాయి’ సినిమాతో జనవరి 1న రమేశ్ వర్మగారు నాకో మంచి సినిమా ఇచ్చారు. థియేటర్స్‌లో మాత్రమే ఈ సినిమా చూడండి. పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు’’ అని హీరో నాగశౌర్య అన్నారు. నాగశౌర్య, పల్లక్ లల్వానీ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట నిర్మించిన ‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో రమేశ్ వర్మ మాట్లాడుతూ- ‘‘వసూళ్లు చాలా స్టడీగా ఉన్నాయి. అన్ని ఏరియాల నుంచి మంచి  రిపోర్ట్స్ వస్తున్నాయి.
 
  సినిమాను ఇంకా ఆదరిస్తారనే  నమ్మకముంది’’ అని చెప్పారు. నిర్మాణ భాగస్వామి శాస్త్రి మాట్లాడుతూ- ‘‘నాగశౌర్య కెరీర్‌లో మంచి ఓపెనింగ్స్ వచ్చిన సినిమా ఇదే. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా  బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా ఇంకా బాగా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు.  ఈ వేడుకలో కథానాయిక పల్లక్ లల్వానీ, నిర్మాతల్లో ఒకరైన శ్రీనివాస్ సమ్మెట, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కొడాలి మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement