
తెలంగాణ వాళ్లకు ఆంధ్రా దేవుడెందుకు: వర్మ
ఏదో ఒక వివాదం లేకపోతే దర్శకుడు రాంగోపాల్ వర్మకు నిద్రపట్టేలా లేదు. తాజాగా ఆయన దేవుళ్ల మీద పడ్డారు.
ఏదో ఒక వివాదం లేకపోతే దర్శకుడు రాంగోపాల్ వర్మకు నిద్రపట్టేలా లేదు. తాజాగా ఆయన దేవుళ్ల మీద పడ్డారు. తనకు దేవుడి మీద నమ్మకం లేదంటూనే.. దేవుళ్లలో కూడా తెలంగాణ, ఆంధ్ర తేడాలు తీసుకొచ్చారు. తెలంగాణ ప్రజలు తమ సొంత దేవుడైన యాదగిరి నరసింహుడి కంటే.. ఆంధ్రా దేవుడైన తిరుపతి వెంకటేశ్వరుడిని పూజించడం సరైనదేనా అని ట్విట్టర్లో ప్రశ్నించారు. తనకు దేవుడంటే నమ్మకం లేదని.. అయినా తెలంగాణ ప్రజలు తిరుపతి బాలాజీని పూజించడం యాదగిరి నరసింహుడికి అవమానమేనని తాను భావిస్తానని వర్మ వ్యాఖ్యానించారు.
మన సొంత దేశాన్ని మనం ప్రేమించినట్లుగానే సొంత దేవుళ్లని పూజించాలి తప్ప పొరుగు రాష్ట్రాల దేవుళ్లను కాదని అన్నారు. వెంకటేశ్వరుడి కంటే తెలంగాణ ప్రజలు యాదగిరి నరసింహుడిని తక్కువగా తలచుకుంటారనడం తప్పు కాదుకదా అని ట్విట్టర్ అభిమానులను ప్రశ్నించారు. అయితే.. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని, దీనివల్ల తెలంగాణ ప్రజలు తమ సొంద దేవుడి విలువను తెలుసుకుంటారని కూడా చెప్పి.. అంతటితో ఆ అంశాన్ని ముక్తాయించారు.
Is it Right that Telangana people pray to Andhra people's Balaji more than their own Yadagiri Narasimha ?
— Ram Gopal Varma (@RGVzoomin) November 19, 2014