రానా ప్రేయసి మిహీక వివరాలు ఇవే..  | Rana Daggubati Lover Miheeka Bajaj Details | Sakshi
Sakshi News home page

రానా ప్రేయసి మిహీక వివరాలు ఇవే.. 

Published Tue, May 12 2020 8:44 PM | Last Updated on Tue, May 12 2020 9:34 PM

Rana Daggubati Lover Miheeka Bajaj Details - Sakshi

హైదరాబాద్‌ : తన ప్రేమకు మిహీక బజాజ్‌ ఒకే చెప్పిందని ప్రముఖ నటుడు రానా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఓ ఇంటివాడు కాబోతున్న రానాకు మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌, సమంత.. ఇలా పలువురు సినీ ప్రముఖలు సోషల్‌ మీడియా వేదికగా బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే ఇరు కుటుంబాలు వీరిద్దరి పెళ్లికి ముహుర్తం నిర్ణయించనున్నట్టుగా సమాచారం. తన ప్రేమ విషయాన్ని వెలువరించి రానా సంలచనం రేపడంతో.. రానా అభిమానులతో పాటుగా చాలా మంది గూగుల్‌లో మిహీక వివరాలు వెతకడం ప్రారంభించారు.  ఆమెకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి : ఆమె యస్‌ చెప్పింది  : రానా)

మిహీక పక్కా హైదరాబాదీ.. ప్రస్తుతం ఆమె డ్యూ డ్రాప్‌ పేరిట ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఇండియన్‌ ఆర్కిటెక్చర్‌పై ఇష్టంతో.. ముంబైలోని రచన సంసద్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ లో డిప్లొమా అందుకున్నారు. లండన్ లోని చెల్సియా యూనివర్సిటీలో ఆర్ట్ అండ్ డిజైనింగ్ లో ఎంఏ చేశారు. ఇలా ఇంటీరియర్‌ డిజైనింగ్‌ రంగంలోకి అడుగుపెట్టారు. మిహీక తల్లిదండ్రులు విషయానికి వస్తే తండ్రి పేరు సురేష్‌ బజాజ్‌, తల్లి బంటీ బజాజ్‌. ఆమె తల్లి హైదరాబాద్‌లోనే క్రస్లా బ్రాండ్‌ పేరిట జ్యూవెలరీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మిహీకకు ఓ సోదరుడు కూడా ఉన్నాడు.. అతని పేరు సమర్థ్‌. అంతేకాకుండా వెంకటేశ్‌ కమార్తె అశ్రితకు మిహీక మంచి స్నేహితురాలని సమాచారం. చదవండి: 'భళ్లాల దేవుడు ప్రేయసి వలలో చిక్కుకున్నాడు'

రానా విషయానికి వస్తే.. ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడిగా, సురేష్‌ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి సినిమా లీడర్‌తోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా రానా తన సత్తా చాటారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన బాహుబలి చిత్రంలో భల్లాలదేవ పాత్రలో రానా అద్భుతమైన నటను ప్రదర్శించారు. అలాగే విభిన్న చిత్రాల్లో నటిస్తూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు. తెరపైనే కాకుండా ప్రొడక్షన్‌ పనుల్లో కూడా రానా మంచి అనుభవం ఉంది. నంబర్‌ వన్‌ యారీ టీవీ షో ద్వారా పలువరు టాలీవుడ్‌ ప్రముఖలతో తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేసి ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. రానాకు ఓ సోదరుడు అభిరామ్‌, సోదరి మాళవిక ఉన్నారు. మాళవికకు ఇప్పటికే పెళ్లి అయిన సంగతి తెలిసిందే. మరోవైపు అభిరామ్ త్వరలో‌ సినిమాల్లోకి రానున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement