గ్యాప్‌లో మరో సినిమా చేస్తున్నాడు | Rana Daggubati to play naval officer in Ghazi | Sakshi
Sakshi News home page

గ్యాప్‌లో మరో సినిమా చేస్తున్నాడు

Published Thu, Jan 7 2016 9:39 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM

గ్యాప్‌లో మరో సినిమా చేస్తున్నాడు

గ్యాప్‌లో మరో సినిమా చేస్తున్నాడు

ప్రభాస్, రాజమౌళి లాంటి స్టార్లు బాహుబలి సినిమాకే పరిమితం అవుతుంటే అదే సినిమాలో మరో లీడ్ రోల్‌లో నటిస్తున్న రానా మాత్రం గ్యాప్ దొరికినప్పుడల్లా మరో సినిమా చేస్తున్నాడు. బాహుబలిలో భల్లాలదేవగా ఆకట్టుకున్న రానా తొలి భాగం రిలీజ్ అయిన తరువాత బెంగళూర్ డేస్ రీమేక్‌లో నటించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. బాహుబలి-2లో రానా చేయాల్సిన పార్ట్ షూటింగ్‌కు ఇంకా టైమ్ ఉండటంతో, ఇప్పుడు మరో సినిమాను స్టార్ చేశాడు. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించాడు.

బాహుబలి 2 ఇప్పటికే స్టార్ట్ కావాల్సిన ఉన్నా ప్రీ ప్రొడక్షన్ పనుల కారణంగా ఆలస్యం అయ్యింది. దీంతో ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవాలనుకున్న రానా ఘాజీ సినిమాను గురువారం మొదలుపెట్టాడు. ఇండో-పాక్ యుద్ధ సమయంలో విశాఖ సరిహద్దులో మునిగిపోయిన ఓ జలతార్గమికి సంబంధించిన కథతో తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు యుద్ధ సన్నివేశాలతో చాలా సినిమాలు వచ్చినా, జలాంతర్గామి నేపథ్యంతో వచ్చిన తొలి యుద్ధ సినిమా కావడంతో.. దీన్ని పివిపి సినిమా భారీగా తెరకెక్కించనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement