అమ్మ కానున్న రాణీ ముఖర్జీ | Rani Mukerji Is Pregnant And Her Baby Is Due In January | Sakshi
Sakshi News home page

అమ్మ కానున్న రాణీ ముఖర్జీ

Published Wed, Sep 2 2015 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM

అమ్మ కానున్న రాణీ ముఖర్జీ

అమ్మ కానున్న రాణీ ముఖర్జీ

‘తా... రా... రంపమ్’లో ఇద్దరు బిడ్డలకు తల్లిగా రాణీ ముఖర్జీ అద్భుతంగా నటించారు. బిడ్డల పట్ల ఓ తల్లికి ఉండే మమకారాన్ని ఆ చిత్రంలో చక్కగా ఆవిష్కరించారు. రీల్ లైఫ్‌లోనే అమ్మగా ఈ స్థాయిలో ఒదిగిపోయిన రాణీ రియల్ లైఫ్‌లో పిల్లలుంటే కచ్చితంగా ‘బెస్ట్ మమ్మీ’ అనిపించుకుంటారు. ఆ సమయం రానే వచ్చింది. అవును... రాణి ముఖర్జీ ఇప్పుడు ప్రెగ్నెంట్. గత ఏడాది దర్శక -నిర్మాత ఆదిత్య చోప్రాతో ఆమె వివాహం జరిగిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి నిన్న మొన్నటి దాకా రాణి గర్భవతి అనే వార్తలు వీర విహారం చేశాయి. కానీ, ఆ వార్తలన్నీ నిజం కాలేదు. తాజా వార్త మాత్రం నిజమే. వచ్చే ఏడాది జనవరిలో రాణీకి డెలివరీ డేట్ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement