రణ్‘బోర్’!
బాలీవుడ్‌లో ఒక్కోరిదీ ఒక్కో స్టైల్. ఎవరికి వారుగా ఐడెంటిటీ తెచ్చుకోవాలని తెగ ఉబలాటపడి పోతుంటారు... రీల్‌లో కాదు... రియల్ లైఫ్‌లో! దానికి ‘హద్దూ’ అదుపూ అంటూ ఏమీ లేకుండా పోయిందనడానికి పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్... అప్‌కమింగ్ హీరో రణవీర్‌సింగ్. నటుడిగా కంటే దీపికా పడుకొనే బాయ్‌ఫ్రెండ్‌గానే యమ పాపులారిటీ సంపాదిస్తున్న ఇతగాడు... తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొనే క్రమంలో ‘అతి’గాడైపోతున్నాడు. సంజయ్ లీలా బన్సాలీ సోదరి బేలా సెహగల్ తనకు పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ఇచ్చిన విందులో రచ్చ చేశాడట ఈ కుర్రాడు. ఓ పాటకు చొక్కా విప్పేసి స్టేజీ ఎక్కేసి చిందులేసి గోల చేశాడట. అతడిని కంట్రోల్ చేయడానికి బన్సాలీ పాట్లు పడ్డాడట పాపం!