
‘ఛలో’ అంటూ హిట్ కొట్టిన కన్నడ భామ రష్మిక మందాన్న.. తెలుగునాట భారీ ఫాలోయింగ్‌ను సంపాదించింది. ‘గీత గోవిందం’తో మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుని తిరుగులేని క్రేజ్‌ను తెచ్చుకుంది. ఈ రెండు సినిమాలు హిట్ కావడంతో రష్మిక తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. అయితే ఈ భామ కన్నడ పరిశ్రమ వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదని, దీంతో శాండల్‌వుడ్ రష్మికపై గుర్రుగా ఉందంటూ కథనాలు వెలువడ్డాయి.
వీటిపై రష్మిక స్పందిస్తూ.. ‘ఇది ఎవరు చెప్పారు? తప్పుగా తీసుకోవద్దు. జస్ట్ ఇంట్రెస్ట్ గా తెలుసుకోవాలని ఉంది. డైరెక్ట్‌గా నాకే మెసేజ్ చేయండి.. నేనేం అనుకోను. నా ఇండస్ట్రీ నా మీద కోపంగా ఉందా? ఇది రాసాక మీకు సెన్స్ లేదని అర్ధమయ్యింది. ఇండస్ట్రీ నా మీద కోపంగా ఉంది అంటే నేను నమ్మను. నాకు ప్రూఫ్ కావాలి. ఇవ్వండి..ఇవ్వండి.. డైరెక్ట్‌గా నాకే మెసేజ్ చేయండి’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం రష్మిక.. విజయ్ దేవరకొండ సరసన ‘డియర్ కామ్రేడ్’లో నటిస్తోంది.
Says this WHO?! Don’t take me wrong but I am just curious😇 DM me the answer..I won’t mind😉 Cz it doesn’t make any sense when U write about my industry,and say they are angry with me..I wont believe it -I need proof🤷🏻♀️give!give! DM me ok..😉♥️’night 😁https://t.co/aFsqjIoRKZ
— Rashmika Mandanna (@iamRashmika) January 31, 2019
Comments
Please login to add a commentAdd a comment