
హమ్మయ్య.. రవితేజ సినిమా మొదలవుతోంది..!
ఒకప్పుడు ఏడాది మూడు, నాలుగు సినిమాలను రిలీజ్ చేసిన మాస్ మహరాజ్ రవితేజ, గత ఏడాది ఒక్క సినిమాలో కూడా నటించలేదు. రెండు, మూడు ప్రాజెక్ట్లు మొదలువుతున్నాయన్న వార్తలు వినిపించినా.. ఏదీ సెట్స్ మీదకు రాలేదు. రవితేజ కూడా సినిమాలు మొదలెట్టకుండా వరల్డ్ టూర్ అంటూ కాలం గడిపేసాడు. ఫైనల్గా లాంగ్ బ్రేక్ తరువాత తిరిగి షూటింగ్కు రెడీ అవుతున్నాడు మాస్ హీరో.
విక్రమ్ సిరి అనే కొత్త దర్శకుణ్ని పరిచయం చేస్తూ నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో రవితేజ నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజతో కలిసి బెంగాళ్ టైగర్ సినిమాలో హీరోయిన్గా నటించిన రాశీఖన్నా మరోసారి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు దిల్ రాజు నిర్మాణంలో కూడా ఓ సినిమాకు రవితేజ ఓకే చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది.