ఆయనతో డేట్‌కు రెడీ..: రకుల్
టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. తొలుత కోలీవుడ్‌లో నిరాదరణకు గురై టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుని ప్రముఖ హీరోయిన్‌గా ఎదిగిన ఈ ఉత్తరాది బ్యూటీ తాజాగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబుకు జంటగా స్పైడర్ చిత్రంలో నటిస్తోంది. తమన్నా, తాప్సీ, ఎమీ జాక్సన్ వంటి తారల్లా రకుల్ ప్రీత్ సింగ్‌కు బాలీవుడ్ మోహం పుట్టిందట.
అక్కడ ఎలాగైనా అవకాశాలు దక్కించుకోవాలన్న ప్రయత్నాలను ఇప్పటి వరకూ రహస్యంగా చేసిన ఈ బ్యూటీ తాజాగా డైరెక్ట్‌గానే రంగంలోకి దిగిందట. ఇటీవల మీకు నచ్చిన ఏ హీరోతో డేటింగ్ చేస్తారన్న ప్రశ్నకు హిందీ నటుడు రణ్‌వీర్‌సింగ్ అని తడుముకోకుండా ఠక్కున చెప్పింది.