తూర్పు గదిలో... | Rosini Karef thurupu gadhi Audio Launch | Sakshi
Sakshi News home page

తూర్పు గదిలో...

Published Sun, May 13 2018 2:22 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

Rosini Karef thurupu gadhi Audio Launch - Sakshi

మున్నా, ప్రియాంక

మున్నా, ప్రియాంక ఆగస్టిన్‌ జంటగా శ్రీనివాస్‌ మరియు సుధీర్‌ నిర్మాణంలో శరగడం శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రోషిని కేరాఫ్‌ తూర్పు గది’. ఈ చిత్రం ఆడియో లాంచ్‌ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ మధ్యకాలంలో కథా బలం ఉన్న సినిమాలే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

మంచి కథలతో సినిమా రూపొందిస్తే కచ్చితంగా సక్సెస్‌ సాధించవచ్చు. ఇండస్ట్రీలో ఎంప్లాయిమెంట్‌ చిన్న సినిమాల వల్లే జరుగుతుంది’’ అన్నారు. దర్శకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘చాలా ఏళ్లుగా ఇండస్ట్రీనే నమ్ముకుని ఉన్నాను. సినిమా మేకింగ్‌లో టీమ్‌ అందరూ చాలా మంచి సహకారం అందించారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నా, ప్రియాంక, సుధీర్, ముత్యాల రాందాస్,   జేవీ మోహన్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement