దయ్యం ప్రేమిస్తే! | Saahasam Seyara Dimbaka Movie | Sakshi
Sakshi News home page

దయ్యం ప్రేమిస్తే!

Published Tue, Jul 21 2015 11:12 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

Saahasam Seyara Dimbaka Movie

ఓ యువకుడు అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అతణ్ణి ఓ దయ్యం ప్రేమిస్తుంది. మరి తర్వాత అతని పరిస్థితి ఏంటనే కథాంశంతో సాగే చిత్రం ‘సాహసం సేయరా డింభకా’. శ్రీ, హమీద, సమత ముఖ్యతారలుగా తిరుమలశెట్టి కిరణ్ దర్శకత్వంలో ఎం.ఎస్. రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ వసంత్ స్వరాలందించిన ఈ చిత్రం ప్లాటినం డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. శ్రీ మాట్లాడుతూ -‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బ న వ్వి స్తుంది’’ అన్నారు. ‘‘షకలక శంకర్ పోషించిన పాత్ర ఈ చిత్రానికి హైలైట్. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల చేయ నున్నాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement