Different Concept
-
Rajasthan elections 2023: మియో వర్సెస్ ‘రక్షక్’
రాజస్తాన్‌లోని ఆళ్వార్ జిల్లా ఆవుల స్మగ్లింగ్, సంబంధిత హింసాకాండతో గతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచింది. మత ఘర్షణలు కూడా అక్కడ పరిపాటి. ఈ నేపథ్యంలో ఆవులను కాపాడేందుకు అక్కడ కొన్నేళ్లుగా గో రక్షకులు కూడా తెరపైకి రావడంతో పరిస్థితి కాస్తా ముదురు పాకాన పడింది. స్థానిక మియో ముస్లింలు ఆవులను లక్ష్యంగా చేసుకున్నారన్నది వారి ఆరోపణ. కానీ ఆవుల స్మగ్లింగ్, వధతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని ముస్లింలు వాదిస్తున్నారు. నవంబర్ 25న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల పట్ల వారిలో భిన్న స్పందన వ్యక్తమవుతోంది. నిత్యం తమపై బురదజల్లడం బీజేపీ నైజమని మియో ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా కమలం పారీ్టయే రాష్ట్రానికి ఆశా కిరణమన్నది గో రక్షకుల అభిప్రాయంగా కని్పస్తోంది. బీజేపీ అలా.. కాంగ్రెస్ ఇలా...! మియో ముస్లింలకు ప్రధానంగా పశు పోషణే జీవనాధారం. అభివృద్ధి, మెరుగైన ఉపాధి లభిస్తే తప్ప తమ జీవితాల్లో మార్పు రాబోదన్న నిశి్చతాభిప్రాయం వారి మాటల్లో ప్రతిఫలిస్తోంది. ఈ ముస్లిం ప్రాబల్య గ్రామాలు చాలావరకు వెనకబడే ఉన్నాయి. రోడ్ల వంటి మౌలిక వసతులు, స్కూళ్లు తదితర సదుపాయాలకు దూరంగా ఉండిపోయాయి. బీజేపీ నిత్యం తమను దోషుల్లా చిత్రిస్తుందన్నది వారి ప్రధాన ఆవేదన. ‘‘అందుకే మా జీవితాలను ఎంతో కొతం మెరుగు పరుస్తుందని పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేశాం. కానీ ఐదేళ్లయినా ఏ మార్పూ లేదు’’ అంటూ మొహమ్మద్ రఫీక్ వాపోయాడు. ‘‘ఓ 30 ఏళ్ల క్రితం దాకా మతపరమైన సమస్యలేవీ పెద్దగా ఉండేవి కాదు. హిందువులు, మేం కలసిమెలసి బతికేవాళ్లం. కానీ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం మొదలయ్యాక పరిస్థితులు బాగు చేయలేనంతగా పాడయ్యాయి’’ అని అన్సారీ అనే వృద్ధుడు ఆవేదన వెలిబుచ్చాడు. గూండాలన్నా పట్టించుకోం! ఇక గో రక్షకుల వాదన మరోలా ఉంది. సనాతన ధర్మంలో గోవును మాతగా పూజించడం సంప్రదాయం. వాటికి అవమానం, ప్రాణాపాయం జరిగితే ఊరుకునేది లేదు’’ అని ఒక గో రక్షక్ స్పష్టం చేశారు. ‘‘నేను ఎనిమిదేళ్లుగా గో రక్షక్గా ఉంటున్నా. మాపై దొంగలు, బందిపోట్లు అని ముద్ర వేశారు. గూండాలని కూడా నిందిస్తున్నారు. అయినా దేనికీ భయపడేది లేదు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ఆవుల స్మగ్లర్లు పోలీసుల సమక్షంలోనే మాపై దాడులకు దిగుతున్నా అడ్డుకునే దిక్కు లేదు. ఎప్పుడు ఏ కారును ఆపినా ఆవుల కళేబరాలే కని్పస్తున్నాయి. మేమెలా సహించేది?’’ అని ప్రశ్నించారాయన. ముస్లిం సంతుïÙ్టకరణతో కూడిన పేరు గొప్ప సోదరభావం తమకు అక్కర్లేదని మరో గో రక్షక్ స్పష్టం చేశారు. మత రాజకీయాలు ‘వారికి’ అలవాటేనని ఆరోపించారు. పరిస్థితిని చక్కదిద్దాలంటే బీజేపీ రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌పై అసంతృప్తి అయితే కులమతాలతో నిమిత్తం లేకుండా ఆళ్వార్ ప్రజల్లో చాలామంది కాంగ్రెస్ పాలన పట్ల పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా తమ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలూ జరగలేదన్నది వారి ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ నేతల మాటలు చేతల్లో ఎక్కడా కని్పంచలేదని వారు వాపోతున్నారు. ‘‘అందుకే కాంగ్రెస్‌కు మరోసారి ఓటేయాలని లేదు. అలాగని చూస్తూ చూస్తూ మమ్మల్ని అడుగడుగునా అనుమానించి అవమానిస్తున్న బీజేపీకి ఓటేయలేం. మా పరిస్థితి అయోమయంగానే ఉంది’’ అని స్థానిక ముస్లిం యువకుడొకరు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి మియో ముస్లింలు ఎవరికి ఓటేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శారీరకంగా, మానసికంగా కాస్త డిఫరెంట్‌గా..
‘శారీరకంగా, మానసికంగా కాస్త డిఫరెంట్‌గా కనిపించాలి.. ఓకేనా’ అంటే, మరో మాట మాట్లాడకుండా ‘ఓకే’ చెప్పేస్తారు కొందరు స్టార్స్. అలాంటి క్యారెక్టర్లను సవాల్‌గా తీసుకుని, తమలోని ఆర్టిస్ట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తారు. కొందరు స్టార్స్ ఈ మధ్య అలా డిఫరెంట్‌గా కనిపించే మిషన్ మీద ఉన్నారు. కొంచెం ‘డిఫరెంట్’గా కనిపించే ఆ క్యారెక్టర్ల గురించి తెలుసుకుందాం. ఎంత డబ్బైనా ఆఫర్ చేయండి? ఎంతటి దావత్నైనా ప్లాన్ చేయండి? సాయంత్రం ఆరు దాటితే అడుగు బయటపెట్టేదే లే అంటున్నారు వెంకటేశ్. ఇటు వెంకటేశ్ వెండితెర కో బ్రదర్ వరుణ్ తేజ్ కూడా గలాగలా మాట్లాడమంటే కాస్త గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నారు. ఈ కో బ్రదర్స్‌కు ఈ పరిస్థితి తెచ్చిపెట్టింది ‘ఎఫ్ 3’ చిత్రమే. ‘ఎఫ్ 2’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జీవితంలో డబ్బు ప్రధానమా లేక బంధాలు ముఖ్యమా? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే ఈ చిత్రంలో రే చీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేశ్, నత్తితో ఇబ్బందిపడే వ్యక్తి పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు. ఈ చిత్రంలో సునీల్, సోనాలీ చౌహాన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ‘ఎఫ్ 3’ చిత్రం ఈ ఏడాది మే 27న విడుదల కానుంది. మరోవైపు మాటల్లేవ్ అంటున్నారు హీరో సూర్య. ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ బధిర (చెవుడు, మూగ) వ్యక్తి పాత్రలో సూర్య నటిస్తారనే ప్రచారం సాగుతోంది. బాల దర్శకత్వంలో వచ్చిన ‘నంద’, ‘పితామగన్’ (తెలుగులో ‘శివపుత్రుడు’) తదితర చిత్రాల్లో నటించారు సూర్య. అలాగే బాల తెరకెక్కించిన ‘అవన్ ఇవన్’ (తెలుగులో వాడు–వీడు) చిత్రంలో అతిథి పాత్రలో నటించారు. తాజాగా బాల దర్శకత్వంలో సూర్య చేయనున్న సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ఆరంభం కానుంది. ఇంకోవైపు ప్రముఖ నటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ఓ చిత్రంలో మోనోఫోబియాతో బాధపడుతున్న రచయిత పాత్ర చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం ద్వారా సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఒక ప్రమాదం ఓ రచయిత జీవితాన్ని ఎలా మార్చేసింది? అతను ఎదుర్కొంటున్న సమస్య మరో పెద్ద సమస్యకు కారణం అయితే దాన్ని ఎలా అధిగమించాడు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక అటు హిందీవైపు వెళితే చాలెంజింగ్ రోల్స్ చేస్తూ, దూసుకెళుతున్న తాప్సీ నటించిన తాజా చిత్రం ‘బ్లర్’. కంటి చూపుకి సంబంధించిన కథ ఇది అని టైటిలే చెప్పేస్తోంది. ఈ చిత్రకథ నచ్చి లీడ్ రోల్ చేయడానికి అంగీకరించడంతో పాటు తాప్సీ ఓ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ‘జూలియాస్ ఐస్’ అనే స్పానిష్ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ ‘బ్లర్’లో క్రమ క్రమంగా కంటిచూపు మందగించే పాత్ర చేశారు తాప్సీ. చూపు మెరుగుపడడానికి శస్త్ర చికిత్స చేయించుకుని, కళ్లకు బ్యాండేజ్‌తో తాప్సీ కనిపించే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సీన్లలో నటించే ముందు నిజంగానే తాప్సీ కళ్లకు బ్యాండేజ్ వేయించుకుని, ఓ పన్నెండు గంటల పాటు అలానే తన పనులు చేసుకున్నారట. క్యారెక్టర్లోకి పూర్తిగా ఒదిగిపోవాలనే ఇలా చేశారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అజయ్ బెహల్ ఈ చిత్రానికి దర్శకుడు. కొంచెం కొంచెంగా చూపు మందగించే పాత్రను తాప్సీ చేస్తే ‘బ్లైండ్’ చిత్రంలో సోనమ్ కపూర్ పూర్తిగా కళ్లు కనిపించని యువతిగా నటించారు. ఓ ప్రమాదంలో చూపు కోల్పోవడం, చేస్తున్న పోలీస్ జాబ్‌కు ఫుల్ స్టాప్ పడడం, ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. కొరియన్ సినిమా ‘బ్లైండ్’కి రీమేక్‌గా అదే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందింది. షోమే మఖీజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ గత ఏడాదే పూర్తయింది. త్వరలో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని సమాచారం. ఇక్కడ పేర్కొన్న స్టార్స్ మాత్రమే కాదు.. మరికొందరు కూడా కొంచెం ‘డిఫరెంట్’ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నారు. -
ఖైదీ బిర్యానీ.. ఇది లేటేస్ట్ గురూ..
కాకినాడ/రాజమహేంద్రవరం సిటీ: లోకో భిన్న రుచి అంటారు. ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. ఏ విషయంలోనైనా కావచ్చు. ముఖ్యంగా ఆహారం విషయంలో ఇదెక్కువగా అందరిలో కనిపిస్తోంది. కొందరికి ఒక్క టిఫిన్ సెంటరే నచ్చుతుంది. మరొకరు తనకు నచ్చిన హోటల్లో తప్ప మరోచోట భోజనం చేయరు. ఏమైనప్పటికీ ఆహారాభిరుచికి ఇంచుమించు అందరూ అగ్రాసనం వేస్తారు. అందుకే వీరిని ఆకట్టుకోవడానికి కొన్ని సంస్థలూ ఇలానే వ్యవహరిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఫుడ్ సెంటర్లు, హోటళ్ల విషయంలో ఈ పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది. చదవండి: రూ.10 వేలతో ప్రారంభించి.. రూ.10 కోట్లకు కాకినాడలో ఆహార ప్రియులను ఆకర్షించేందుకు ‘జైలు థీమ్’తో ఓ రెస్టారెంట్ ఏర్పాటైంది. భోజనం చేసే గది జైలులోని ఖైదీ సెల్లా ఉంటుంది. ఇక్కడ సర్వర్లు ఖైదీ డ్రెస్‌లు వేసుకుని మరీ వడ్డిస్తున్నారు. అంతేకాదు.. బిల్లును ‘బెయిల్’గా వ్యవహరిస్తున్నారిక్కడ. భానుగుడి సెంటర్లో కొత్త కాన్సెప్టుతో వచ్చిన ‘ఖైదీ బిర్యానీ’ రెస్టారెంట్ విశేషంగా ఆకట్టుకుంటోంది. లోపల పూర్తిగా జైలు వాతావరణాన్ని తలపించేలా దీనిని తీర్చిదిద్దారు. అడుగు పెట్టగానే చుట్టూ జైలు ఊసలతో కూడిన 16 క్యాబిన్లు దర్శనమిస్తాయి. 20 మందికి సరిపడా ఓ వీఐపీ సెల్ కూడా ఉంటుంది. జిల్లాలో చైనీస్, కాంటినెంటల్, చెట్టినాడు స్పెషల్ ఇలా వివిధ ప్రాంతాల ఫుడ్ కూడా వడ్డిస్తున్నారు. రావులపాలెం మార్గంలో కూడా రకరకాల ఐటెమ్స్‌తో ఫుడ్ బాగుంటుందని అటుగా దూర ప్రయాణాలు చేసేవారు లొట్టలేసు కుంటూ తింటూంటారు. ఖైదీ బిర్యానీ రెస్టారెంట్ పేరు వింటే ఫిదా ఫుడ్ మాట అటుంచితే కొన్ని రెస్టారెంట్లకు పెడుతున్న పేర్లు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ పేర్లే భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కుర్రకారు అడుగులు ఇటువైపే పడుతున్నాయి. మచ్చుకు రాజమహేంద్రవరంలో కొన్ని పేర్లు ఇవి.. ‘కడుపు నింపుతాం, పొట్ట పెంచుదాం, నా పొట్ట నా ఇష్టం, పాతాళ భైరవి, మాయాబజార్, మిఠాయి పొట్లం, చిక్‌పెట్ దొన్నె బిర్యానీ హౌస్, పల్లెవంట,గోదావరి రుచులు ఇలా పలు రకాల పేర్లతో ఆహారప్రియుల మనసులు గెలుచుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తినే ఆహారం ఒకటే అయినప్పటికీ వైవిధ్యభరితమైన పేర్లతో కస్టమర్ల మనసులో స్థానానికి ప్రయత్నిస్తున్నారు. రుచులకు బందీ కావల్సిందే.. ఆహార ప్రియులను మా హోటల్లో రుచులతో బందీ చేయాలన్నదే ‘జైల్ థీం’ ప్రధాన ఉద్దేశం. కాకినాడలో కొత్తదనంతో హోటల్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ‘ఖైదీ బిర్యానీ’గా పేరు పెట్టాం. మేమిచ్చే ఆతిథ్యం, నాణ్యమైన ఆహారం, సరసమైన ధర చూసి ఆహార ప్రియులు మా ‘ఖైదీ బిర్యానీ’కి మళ్లీ మళ్లీ వచ్చేలా ఆకర్షించడమే ధ్యేయం. ప్రజలను బాగా ఆకట్టుకోగలమన్న నమ్మకం ఉంది. – నల్లపాటి సాయివేణు, ఖైదీ బిర్యానీ రెస్టారెంట్ యజమాని -
దయ్యం ప్రేమిస్తే!
ఓ యువకుడు అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అతణ్ణి ఓ దయ్యం ప్రేమిస్తుంది. మరి తర్వాత అతని పరిస్థితి ఏంటనే కథాంశంతో సాగే చిత్రం ‘సాహసం సేయరా డింభకా’. శ్రీ, హమీద, సమత ముఖ్యతారలుగా తిరుమలశెట్టి కిరణ్ దర్శకత్వంలో ఎం.ఎస్. రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ వసంత్ స్వరాలందించిన ఈ చిత్రం ప్లాటినం డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. శ్రీ మాట్లాడుతూ -‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బ న వ్వి స్తుంది’’ అన్నారు. ‘‘షకలక శంకర్ పోషించిన పాత్ర ఈ చిత్రానికి హైలైట్. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల చేయ నున్నాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్.