'వీడెవడు' అదే రోజు వస్తున్నాడు..! | Sachiin Joshi Veedevadu Movie Release Date | Sakshi
Sakshi News home page

'వీడెవడు' అదే రోజు వస్తున్నాడు..!

Published Wed, Aug 23 2017 11:30 AM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM

'వీడెవడు' అదే రోజు వస్తున్నాడు..!

'వీడెవడు' అదే రోజు వస్తున్నాడు..!

సెప్టెంబర్ మూడో వారం నుంచి భారీ చిత్రాలు లైన్ లో ఉండటంతో చిన్న సినిమాలన్ని ఈ లోపే థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. దీంతో సెప్టెంబర్ 8న భారీ పోటి తప్పేలా లేదు. ఆ రోజు రిలీజ్ అవుతున్న సినిమాల్లో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న యుద్ధం శరణంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ నెలాఖరున రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను రెండు వారాలు ఆలస్యంగా సెప్టెంబర్ 8న రిలీజ్ చేస్తున్నారు.

అదే రోజు పోటి పడుతున్న మరో సినిమా మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడు. చాలా కాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మనోజ్.. డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ గెటప్ తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ తో ఈ సినిమా మీద కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. కామెడీ స్టార్ అల్లరి నరేష్ కూడా అదే రోజు రిస్క్ చేస్తున్నాడు. మేడ మీద అబ్బాయి సినిమాతో సెప్టెంబర్ 8న బరిలో దిగుతున్నట్టుగా ప్రకటించేశాడు.

ఈ మూడు సినిమాలతోనే థియేటర్లు బిజీ అంటే తాజాగా మరో సినిమా లైన్ లోకి వచ్చింది. బాలీవుడ్ నటుడు సచిన్ జోషి హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన 'వీడెవడు' సినిమాను కూడా సెప్టెంబర్ 8న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఇంట్రస్టింగ్ సినిమాలతో భారీ పోటి నెలకొన్న నేపథ్యంలో వీడెవడు సినిమా రిలీజ్ చేయటం రిస్క్ అని భావిస్తున్నా.. తమిళ్ లోనూ అదే రోజు రిలీజ్ చేస్తుండటంతో డేట్ మార్చే ఛాన్స్ కనిపించటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement