'సాహసమే శ్వాసగా సాగిపో' ట్రైలర్ రిలీజ్ | Sahasam Swasaga Sagipo trailer released | Sakshi
Sakshi News home page

'సాహసమే శ్వాసగా సాగిపో' ట్రైలర్ రిలీజ్

Published Mon, Nov 23 2015 12:19 PM | Last Updated on Wed, Aug 29 2018 5:43 PM

'సాహసమే శ్వాసగా సాగిపో' ట్రైలర్ రిలీజ్ - Sakshi

'సాహసమే శ్వాసగా సాగిపో' ట్రైలర్ రిలీజ్

తన కుమారుడు నాగచైతన్యకు అక్కినేని నాగార్జున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చైతన్య సినిమా కెరీర్ ఉజ్వలంగా సాగాలని ఆకాంక్షించారు. ఇలాంటి బర్త్ డేలు మరెన్నో జరుపుకోవాలని దీవించారు. నాగచైతన్య పుట్టినరోజును పురస్కరించుకుని అతడి తాజా చిత్రం 'సాహసమే శ్వాసగా సాగిపో' ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోరు వాడకుండా, రియల్ సౌండ్స్ వాడినట్టు నాగార్జున-  వెల్లడించారు. ట్రైలర్ యూట్యూబ్ లింకును తన ట్విటర్ పేజీలో పోస్టు చేశారు.

ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. చైతన్య సరసన మంజిమా మోహన్ నటిస్తోంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ తెలుగులో సంభాషణలు సమకూర్చడమే కాక, ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తమిళంలో శింబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు 'అచ్చమ్ ఎన్బదు మడమయడ...' అనే టైటిల్ ఇప్పటికే ఖరారు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement