
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ప్రతిరోజూ పండగే. చాలా రోజుల తరువాత చిత్రలహరి సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన సాయి, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిరోజూ పండగేతో మరో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. రేపు రాత్రి 8 గంటలకు ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘వేలు విడువని బంధం’ అనేది ట్యాగ్ లైన్. సాయి ధరమ్ తేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment