థ్రిల్ చేస్తుంది! | sai ram sankar shares her feelings on jagadamba movie | Sakshi
Sakshi News home page

థ్రిల్ చేస్తుంది!

Published Sat, Aug 23 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

థ్రిల్ చేస్తుంది!

థ్రిల్ చేస్తుంది!

మంచి యాక్షన్, చక్కని కామెడీ, థ్రిల్‌కి గురి చేసే అంశాలు... తను నటించే సినిమాలో ఇవన్నీ ఉండాలని ఏ హీరో అయినా కోరుకుంటాడు. అలాంటి కథ దొరికితే ఏ హీరో అయినా వెంటనే పచ్చజెండా ఊపేస్తాడు. సాయిరామ్ శంకర్ ఇటీవల అలా అంగీకరించిన చిత్రం ‘జగదాంబ’. అడ్డాల శ్రీలత సమర్పణలో అడ్డాల పెద్దిరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీయస్ వాసుదేవ్ దర్శకుడు. హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ఓ మంచి కథతో రూపొందుతున్న ఈ చిత్రం థ్రిల్‌కి గురి చేస్తుందని సాయిరామ్ శంకర్ పేర్కొన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకు సాయిరామ్ శంకర్ చేసిన చిత్రాలకు భిన్నంగా ఇది ఉంటుంది. రాహుల్‌రాజ్ మంచి స్వరాలు సమకూరుస్తున్నారు. రెండు షెడ్యూల్స్‌లో చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అల్లూరి రాంమోహన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement