sai ram sankar
-
మా అమ్మ మాకు ఇన్స్పిరేషన్
-
అన్నయ్య రూట్లో!
లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్.. కట్... ప్రతి డైరెక్టరూ షూటింగ్ స్పాట్లో సీన్ తీయడానికి ఇలానే అంటారు. దర్శకుడు ఇలా యాక్షన్ చెప్పగానే... కెమెరా ముందు నటించేవారు సాయిరామ్ శంకర్... బ్రదర్ ఆఫ్ పూరి జగన్నాథ్. అన్నయ్య డైరెక్షన్‌లోనూ ఆయన నటించారు. ఇప్పుడు అన్నయ్య రూట్లో డైరెక్టర్ కాబోతున్నారని టాక్. డైరెక్టర్‌గా మారుతున్నారంటేనటుడిగా కొనసాగరేమో అనుకుంటున్నారా? అదేం లేదు. ఎందుకంటే తాను డైరెక్ట్ చేయనున్న సినిమాలో హీరో కూడా తానే. మామూలుగా పూరి జగన్నాథ్ తన సినిమాలకు తానే కథ రాసుకుంటారు. సాయిరామ్ శంకర్ కూడా అదే ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం కథ రెడీ చేసే పని మీద ఉన్నారట. ఇది లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని సమాచారం. దర్శకుడిగా పూరి ఫుల్ సక్సెస్. తమ్ముడు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. -
థ్రిల్ చేస్తుంది!
మంచి యాక్షన్, చక్కని కామెడీ, థ్రిల్‌కి గురి చేసే అంశాలు... తను నటించే సినిమాలో ఇవన్నీ ఉండాలని ఏ హీరో అయినా కోరుకుంటాడు. అలాంటి కథ దొరికితే ఏ హీరో అయినా వెంటనే పచ్చజెండా ఊపేస్తాడు. సాయిరామ్ శంకర్ ఇటీవల అలా అంగీకరించిన చిత్రం ‘జగదాంబ’. అడ్డాల శ్రీలత సమర్పణలో అడ్డాల పెద్దిరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీయస్ వాసుదేవ్ దర్శకుడు. హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ఓ మంచి కథతో రూపొందుతున్న ఈ చిత్రం థ్రిల్‌కి గురి చేస్తుందని సాయిరామ్ శంకర్ పేర్కొన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకు సాయిరామ్ శంకర్ చేసిన చిత్రాలకు భిన్నంగా ఇది ఉంటుంది. రాహుల్‌రాజ్ మంచి స్వరాలు సమకూరుస్తున్నారు. రెండు షెడ్యూల్స్‌లో చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అల్లూరి రాంమోహన్.