మళ్లీ ఇలా కనబడితే జాగ్రత్త! | Saif Ali Khan's Warning to Soha Ali Khan | Sakshi
Sakshi News home page

మళ్లీ ఇలా కనబడితే జాగ్రత్త!

Published Mon, Jun 16 2014 10:59 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మళ్లీ ఇలా కనబడితే జాగ్రత్త! - Sakshi

మళ్లీ ఇలా కనబడితే జాగ్రత్త!

 తన చెల్లెలు సోహా అలీఖాన్‌పై సైఫ్ అలీఖాన్ గుర్రుమీద ఉన్నారు. దానికి కారణం ఇటీవల ఆమె చేసిన ఫొటో షూట్. కేవలం లో దుస్తులు మాత్రమే ధరించి, స్విమ్మింగ్ ఫూల్‌లో హాట్ హాట్‌గా సోహా అలీ పోజులిచ్చేశారు. దాంతో ఈ అన్నగారికి కోపం నషాళానికి అంటిందట. ఇంటి పరువు తీసుకెళ్లి స్విమ్మింగ్‌ఫూల్ పాలు చేస్తోందని తల పట్టుకు కూర్చున్నాడట సైఫ్.
 
 అంతటితో ఆగకుండా చెల్లాయమ్మను పిలిచి చీవాట్లు పెట్టాడట. ‘మరోసారి ఇలాంటి ఫొటో షూట్‌లో పోజులిస్తే ఊరుకునేది లేదు... జాగ్రత్త’ అని హెచ్చరికను కూడా జారీ చేశాడట సైఫ్. సోహాకి ఇలాంటి ఫొటో షూట్‌లు కొత్తేం కాదు. గతంలో కూడా ఓ ఇంగ్లిష్ మ్యాగజైన్‌కి హాట్ హాట్‌గా ఫోజులిచ్చి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అప్పుడు కూడా సైఫ్ ఆగ్రహానికి గురయ్యారామె. ఇది రెండో సారి. తన సినిమాల్లో కథానాయికలు ఎంత స్పైసీగా నటించినా ఫర్లేదు కానీ, చెల్లెలు అలా కనిపిస్తే మాత్రం భరించలేకపోతున్నాడు సైఫ్. తన దాకా వస్తే కదా... అసలు బాధ తెలిసేది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement