‘జగదాంబ’గా... | Sairam Shankar's new film titled 'Jagadhamba' | Sakshi
Sakshi News home page

‘జగదాంబ’గా...

Published Sat, Jun 21 2014 10:52 PM | Last Updated on Sat, Sep 2 2017 9:10 AM

‘జగదాంబ’గా...

‘జగదాంబ’గా...

 సాయిరామ్ శంకర్ హీరోగా ‘జగదాంబ’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. పి.ఎస్. వాసుదేవ్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ అడ్డాల పెద్దిరాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇది యాక్షన్ కామెడీ థ్రిల్లర్. సాయిరామ్ శంకర్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ఇందులో ప్రముఖ కథానాయిక నటిస్తారు’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘కథ చాలా బాగా వచ్చింది. ఆగస్టు నుంచి చిత్రీకరణ మొదలు పెడతాం’’ అని తెలిపారు. అభిమన్యు సింగ్, ఎమ్మెస్ నారాయణ, కృష్ణ భగవాన్, సప్తగిరి, ధన్‌రాజ్, కోవై సరళ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: రాహుల్ రాజ్, కెమెరా: సర్వేష్ మురారి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అల్లూరు రామ్ మోహన్.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement