'ఫోన్ చేసి హాయ్ చెప్పే ఫ్రెండ్స్ ఎవరూ లేరూ' | sakshi exclusive interview with actress priyamani | Sakshi
Sakshi News home page

'ఫోన్ చేసి హాయ్ చెప్పే ఫ్రెండ్స్ ఎవరూ లేరూ'

Published Tue, Oct 27 2015 5:13 PM | Last Updated on Wed, Apr 3 2019 9:13 PM

'ఫోన్ చేసి హాయ్ చెప్పే ఫ్రెండ్స్ ఎవరూ లేరూ' - Sakshi

'ఫోన్ చేసి హాయ్ చెప్పే ఫ్రెండ్స్ ఎవరూ లేరూ'

హీరోయిన్‌ల అందాల ఆరబోతే ప్రధానంగా సాగుతున్న చిత్రరంగంలో తన అభినయంతో అటు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు బాక్సాఫీస్ రికార్డుల్లో సైతం తనదైన పాత్ర పోషిస్తూ  ముందుకు వెలుతున్నారు బహుభాష నటి ప్రియమణి. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘జ్యువెల్స్ ఆఫ్ ఇండియాకు’ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన సందర్భంగా ప్రియమణితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ...

 
సాక్షి: హీరోయిన్ అనే విషయాన్ని పక్కన పెడితే ఒక అమ్మాయిగా ఎలాంటి నగలంటే మీకు ఇష్టం?
ప్రియమణి: అమ్మయిలకు నగలకు మించిన ఫ్రెండ్స్ ఉండరు. ఇందుకు నేను అతీతం కాదు. అన్ని రకాల నగలను ధరిస్తుంటాను. నా శరీరతత్వానికి టెంపుల్ జ్యువెలరీ అంటే ఎక్కువ ఇష్టం. అయితే పార్టీలకు వెళ్లేటప్పుడు చాలా తేలికైన  నగలు ధరిస్తాను. సినిమాల్లో చాలా కొత్త కొత్త నగలు ధరించే సమయంలో సంతోషంగా ఉంటుంది. అయితే వాటిని తిరిగి ఇచ్చేయాల్సినప్పుడే కొంత బాధ అనిపిస్తుంది. (నవ్వేస్తూ).
 
సాక్షి: హీరోయిన్‌గా మీరు అనేక దేశాలను తిరుగుతుంటారు. విదేశీ జ్యువెలరీకు మన భారతీయ నగలకు తేడా ఏంటి?
ప్రియమణి: మన దగ్గర ఉన్నటువంటి రకాల నగలు విదేశాల్లో అందుబాటులో ఉండవు. ఇక్కడి మహిళలు బంగారు ఆభరణాలు ధరించడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే విదేశాల్లో వజ్రం, ముత్యంతో తయారైన వాటికి డిమాండ్ ఎక్కువ. ఇక అక్కడి మహిళలు ఎప్పుడో ఒకటి రెండు సార్లు ఆభరణాలు ధరిస్తే మనం ప్రతి కార్యక్రమానికి జ్యువెలరీ ఉండాల్సిందే. అమ్మానాన్న తోడు లేకుండా అయినా ఇక్కడి అమ్మాయిలు వెలుతామేమో కాని జ్యువెలరీ లేకుండా ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టరు.
 
సాక్షి: ప్రస్తుత జ్యువెలరీ విషయంలో ఎటువంటి ట్రెండ్ ఫాలోకావాలని అమ్మాయిలకు చెబుతారు.?
ప్రియమణి: లైట్‌వెయిట్ జ్యువెలరీ ప్రస్తుతం ఎక్కువగా వాడండి. అయితే జ్యువెలరీ అన్నది ఎప్పుడూ కూడా మనం ధరించిన దుస్తులను బట్టి ఉండాలి. అటుపై మనం ఎటువంటి కార్యక్రమానికి హాజరవుతున్నామన్న విషయాన్ని అనుసరించి జ్యువెలరీ ధరించాలి. అప్పుడే అందంగా కనబడుతారు.  
 
సాక్షి: అందాన్ని నిర్వచించమని ‘హీరోయిన్’ ప్రియమణిని అడిగితే...?
ప్రియమణి: చాలా సులభమనిపించే అతి కష్టమైన ప్రశ్న. (కొద్దిసేపు ఆలోచించి..తనకు ఎదురుగా ఉన్న ఓ బోన్సాయ్ చెట్టును చూపిస్తూ) ఆ చెట్టు నాకు అందంగా కనిపిస్తోంది. ఇలాంటిదే ఇంటిలో పెంచుకోవాలనుకుంటున్నా. అయితే మరొకకరికి ఆ చెట్టు అందంగా కనిపించకపోవచ్చు. అంటే మన ఆలోచన విధానంపై మాత్రమే ఎదుటి వ్యక్తి అందంగా ఉన్నాడా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. అందమైన ఆలోచనలు ఉన్న వారికి ఎదురుగా ఉన్న ప్రతి వ్యక్తి, చెట్టుతో పాటు రాయి కూడా అందంగా కనిపిస్తుంది.
 
సాక్షి: మీరు చిత్ర రంగంలోకి వచ్చినప్పటికీ... ఇప్పటికీ ప్రధాన తేడా ఏంటి?
ప్రియమణి: చిత్ర రంగంలోని అన్ని విభాగాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. గతం హీరోయిన్ అంటే అప్పట్లో పాటలకు, గ్లామర్ ఆరబోతకు మాత్రమే పరిమితం చేసేవారు. ఇక ఒకటి రెండు విభాగాల్లో మాత్రమే మహిళలకు అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం 24 ఫ్రేములనూ తమ భుజస్కంధాలపై (24 ఫ్రేమ్స్ ఆన్ దెయిర్ షోల్డర్స్) మోస్తూ చిత్రాన్ని విజయ తీరాలకు చేర్చే మహిళలు ఉన్నారు. ఇది మంచి పరిణామం.
 
సాక్షి: ఒక హీరోయిన్‌గా ఉత్తరాధి దక్షిణాది చిత్రరంగాల్లో తేడాను చెప్పమంటే..?
ప్రియమణి: ఉత్తరాది చిత్ర రంగంలో మహిళా ప్రధాన్యత చిత్రాలను కూడా విభిన్న నేపథ్యం, స్క్రీన్‌ప్లేతో నిర్మిస్తారు. ఆ చిత్రాలు కమర్షియల్‌గా కూడా మంచి విజయం సాధిస్తాయి. ఈ మేరకు అక్కడి దర్శక నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటారు. డర్టీపిక్షర్, మేరీ కోమ్ చిత్రాలనే తీసుకుండి రెండూ నాయకీ ప్రధాన చిత్రాలే. అయితే రెండు చిత్రాలు విభిన్నమైనవి. రెండు కూడా ప్రేక్షకుల మన్నలను పొందినవే. అయితే దక్షిణాధిన మహిళా ప్రధాన్య చిత్రాలంటే కేవలం క్రైమ్, థ్రిల్లర్ ప్రధానంగా కథ, కథనాలు ఉంటాయి. ఈ విధానంలో మార్పులు రావాలి.
 
సాక్షి: చిత్రరంగంలో మీకున్న బెస్ట్‌ఫ్రెండ్స్?
ప్రియమణి: అందరూ బెస్ట్‌ఫ్రెండ్స్. అయితే పొద్దున లేవగానే ఫోన్ చేసి హాయ్ చెప్పే ‘ఎయిట్ ఏ.ఎం ఫ్రెండ్స్’ ఎవరూ లేరూ. ఏదేని సినిమాలో హీరోయిన్ నటన బాగుంటే మాత్రం వెంటనే ఆ విషయాన్ని చెప్పేస్తే. ఇటీవల ఓ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో త్రిష సంబంధించిన టీజర్ విడుదలైంది. అందులో త్రిష నటన చూసి ఎంతో ముచ్చటేసింది. వెంటనే ఫేస్‌బుక్‌లో ఆ విషయాన్ని చెప్పేసాను. డ్రీమ్‌రోల్ అంటూ ఏదీ లేదు కాని బయోపిక్ చిత్రంలో నటించాలని అనుకుంటున్నా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement