‘ఎందుకు ఓవరాక్షన్‌ చేస్తున్నారు సల్మాన్‌’ | Salman Khan Gets Trolled For Appropriating Farmers | Sakshi
Sakshi News home page

‘ఇప్పుడు ఇదంతా అవసరమా’

Published Wed, Jul 15 2020 2:51 PM | Last Updated on Wed, Jul 15 2020 3:27 PM

Salman Khan Gets Trolled For Appropriating Farmers - Sakshi

ముంబై: మీరు ఎందుకు అంతగా ఓవరాక‌్షన్‌ చేస్తున్నారంటూ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌పై యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ అభిమానులు, నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో భాయిజాన్‌ పన్వెల్‌లోని తన ఫాంహౌజ్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సల్మాన్‌ తన ఫాంలో వ్యవసాయం చేస్తున్నట్లుగా ఒళ్లంతా మట్టితో ఉన్న ఫొటోను బుధవారం ట్విటర్‌లో షేర్‌ చేశాడు. రైతులకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘రైతులందరికి గౌరవం ఇవ్వండి’ అనే క్యాప్షన్‌ను తన ట్వీట్‌కు జత చేశాడు. ఇక అది చూసిన నెటిజన్లు సల్మాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఫొటోను జూమ్‌ చేసి ‘మీరు ముఖంపై మట్టిని రుద్దారు.. కానీ కాళ్లకు రుద్దడం మరచిపోయారు. ఎందుకు ఇంత ఓవరాక్షన్‌ చేస్తున్నారు’ అంటూ ఓ నెటిజన్‌ భాయిజాన్‌ను ట్రోల్‌ చేశాడు. (చదవండి: సల్మాన్‌, కరణ్‌లపై పిటిషన్‌ కొట్టివేత)

దీంతో మరి కొంతమంది నెటిజన్లు కూడా అతడికి మద్దతునిస్తూ.. ‘‘నేను చాలామంది రైతులను చుశాను.. కానీ వారి ముఖంపై ఎప్పుడు బురదను చూడలేదు’, ఫొటో కోసమే మట్టిని రాసుకున్నట్లు అనిపిస్తుంది. ఇదంతా అవసరమా’’ అంటూ సల్మాన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా భాయిజాన్‌ ప్రస్తుతం ప్రభుదేవ దర్శకత్వంలో వస్తున్న ‘రాధే’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 2020 రంజాన్‌కు ఈ సినిమాను విడుదల చేయలనుకున్నప్పటికీ కరోనా కారణం​గా ఆ సినిమా విడుదల వాయిదా పడింది. కరోనాను అరికట్టెందుకు మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ నుంచి సల్మాన్‌ పన్వెల్‌లోని తన ఫాం హౌజ్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన ఫాంలో హీరోయిన్‌ జాక్వెలిన్‌ ఫర్నాండేజ్‌తో కలిసి చేసిన ‘తేరే బినా’ అల్భంలోని రెండు రోమాంటిక్ పాటలను ఇటీవల విడుదల చేశాడు. ‌(చదవండి: సల్మాన్‌ ట్వీట్‌: విమర్శలు గుప్పించిన సింగర్‌‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement