సల్మాన్ కేసు జూలై 13 కి వాయిదా
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన పై తదుపరి విచారణను బాంబే హైకోర్టు జులై 13కు వాయిదా వేసింది. 2002 హిట్ అండ్ రన్ కేసులో దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సెషన్స్ కోర్టు తీర్పుపై ఆయన అప్పీలుకు వెళ్లారు. అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను, పరిశీలించడానికి మూడు వారాల గడువు కావాలని సల్మాన్ తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ కోరారు. దీనిపై స్పందించిన కోర్టు బుధవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సల్మాన్ అభ్యర్థనను తప్పుబట్టారు. మరింత కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తున్నారని వాదించారు.
కాగా ముంబై నడివీధుల్లో తాగి కారు నడిపి ఇద్దరు వ్యక్తుల మరణానికి దారి తీసిన కేసులో నటుడు సల్మాన్ ఖాన్ ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే సెషన్స్ కోర్టు తీర్పును సస్పెండ్ చేసి, కేసును మళ్లీ విచారించాలని ఆదేశించిన బాంబే హైకోర్టు.. మే 8న సల్మాన్కు బెయిల్ మంజూరుచేసింది.