
దీపావళి పండగ సందర్భంగా ప్రజలకు ప్రముఖ సినీనటి సమంత ఓ విజ్ఞప్తి చేశారు. దీపావళిని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన సమంత.. ఈ పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు. అదే విధంగా ఓ సందేశాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మనం పండగ జరుపుకోవడం చిన్న చిన్న కుక్కపిల్లలకు, వీధుల్లోని మూగ జీవాల ప్రశాంతతకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని మరచిపోకూడదని.. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే బాణాసంచా కాల్చబోమని ప్రామిస్ చేయాలని ఆమె కోరారు. కాగా, సోషల్ మీడియా వేదికగా సమంత తన అభిప్రాయాలను వెల్లడిస్తారనే సంగతి తెలిసిందే.