నయన్‌ కోరికతో బెంబేలు | Sangamitra group who was shocked by Nayanathara remunaration | Sakshi
Sakshi News home page

నయన్‌ కోరికతో బెంబేలు

Published Wed, Jul 12 2017 1:25 AM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

నయన్‌ కోరికతో బెంబేలు

నయన్‌ కోరికతో బెంబేలు

తమిళసినిమా :  తేనాండాల్‌ ఫిలిమ్స్‌ నిర్మాణంలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం సంఘమిత్ర. ఇందులో జయంరవి–ఆర్య హీరోలుగా నటిస్తుండగా సంఘమిత్ర అనే టైటిల్‌ రోల్‌ను శృతిహాసన్‌ నటించాల్సి ఉంది. అందుకోసం అమ్మడుకి అలనాటి కత్తిసాము వంటి కళల్లో శిక్షణలు కూడా ఇప్పించారు. అయితే, చిత్ర షూటింగ్‌ ప్రారంభం కాబోతుందన్న పరిస్థితుల్లో ఆ చిత్రం నుంచి శృతి తప్పుకున్నట్టు వెల్లడించారు. దీంతో ఆ పాత్ర కోసం తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషా నటి కోసం గాలించాల్సిన పరిస్థితి సంఘమిత్ర బృందానికి ఏర్పడింది.

అప్పుడే దక్షిణాదిలో అగ్ర తారలుగా వెలుగుతున్న నయనతార, అనుష్కలతో రెండు సంవత్సరాలకు కాల్‌ షీట్లకు బేరసారాలు జరిపారు. అయితే, ఇద్దరూ ఇప్పటికే కొన్ని చిత్రాల్లో  కమిట్‌ అయ్యి నటిస్తుండడం వల్ల ఇప్పటికి సంఘమిత్రలో నటించడం కుదరదని తెలిపారట. అయినప్పటికీ నయనతార నటిస్తే బాగుంటుందని తలచిన చిత్ర బృందం ఆమెతో పలుమార్లు చర్చలు జరుపుతూ వచ్చారు. సంగమిత్రతో కమిట్‌ అయితే కనీసం ఒకటిన్నర సంవత్సరం కాలం వేరే చిత్రాల్లో నటించడానికి కుదరదు. దీంతో జాగ్రత్తగా ఆలోచించిన నయన్‌ తాను సంఘమిత్రలో నటించడానికి సిద్ధమేనని తెలిపిందట. అయితే అందుకు అమ్మడు కోరిన రెమ్యూనరేషన్‌ మొత్తం విని బెంబేలెత్తిన చిత్ర బృందం ఆ తర్వాత నుంచి ఆమెతో చర్చలు జరపడం నిలిపివేసినట్లు కోలీవుడ్‌ టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement