కొత్త గెటప్‌ గురూ | saroja devi will play a important lead role in puneeth rajkumar new movie | Sakshi
Sakshi News home page

కొత్త గెటప్‌ గురూ

Published Sun, Mar 11 2018 12:53 AM | Last Updated on Sun, Mar 11 2018 12:53 AM

saroja devi will play a important lead role in puneeth rajkumar new movie - Sakshi

కొత్త గెటప్‌లో కనిపించేందుకు రెడీ అవుతున్నారు కన్నడ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌. ఎందుకంటే ఆయన హీరోగా నటించనున్న కొత్త సినిమా కోసం. పవన్‌ వడియార్‌ దర్శకత్వంలో రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పునీత్‌ రాజ్‌కుమార్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో అలనాటి కన్నడ స్టార్‌ సరోజా దేవి కీలక పాత్రలో కనిపించనున్నారట.

పునీత్‌ తండ్రి రాజ్‌కుమార్‌ సరసన హిట్‌ మూవీస్‌లో  నటించారు సరోజా దేవి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు స్కోప్‌ ఉండగా, ప్రియాంక జవాల్కర్‌ను ఒక హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తుదంట. తెలుగులో విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతోన ‘టాక్సీవాలా’ చిత్రంలో ప్రియాంకనే కథానాయిక అన్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement