పి.చంద్రశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో జైహింద్ గౌడ్ హీరోగా నటిస్తూ, నిర్మించనున్న సినిమా ‘సర్వాయి పాపన్నగౌడ్’. ఈ నెల 19న హుస్నాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘‘మన రాజకీయ నాయకుల బ్రష్టు పట్టిన విధానాలను ప్రక్షాళన చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాం.
సమాజ శ్రేయస్సు కోసం మంచి సినిమా ఇవ్వాలనే ఆకాంక్షతో చేస్తున్నాం’’ అని జైహింద్ గౌడ్ తెలిపారు. ‘‘దర్శకుడిగా ఇది నా 90వ సినిమా. చారిత్రక కథాంశంతో ఫ్యామిలీ, యూత్, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుంది’’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి కథ: శమంత, మాటలు-పాటలు: విష్ణుశ్రీ, కెమేరా: కంకణాల శ్రీనివాసరెడ్డి.
సమాజ శ్రేయస్సు కోసం...
Published Mon, Aug 15 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
Advertisement
Advertisement