
పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన అంజనీపుత్ర సినిమా రాష్ట్ర వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న నేపథ్యంలో న్యాయవాదులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఓ న్యాయవాది కోర్టును ఆశ్రయించడంతో చిత్ర ప్రదర్శన నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. న్యాయవాదులు కించపరిచే సన్నివేశాలను తొలగించి, క్షమాపణలు చెప్పాలని న్యాయవాది శనివారం ఇక్కడి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ప్రదర్శనను వచ్చేనెల 2 వరకు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. న్యాయవాదులను కించపరిచే డైలాగ్‌ను తొలగించాలని కోర్టును ఆశ్రయించినట్లు న్యాయవాది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment