రయీస్ ప్రదర్శనపై నిషేధం!
రయీస్ ప్రదర్శనపై నిషేధం!
Published Tue, Feb 7 2017 9:41 AM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM
పాకిస్థానీ నటి మాహిరా ఖాన్ హీరోయిన్‌గా నటించినా కూడా రయీస్ సినిమాను విడుదల చేసేందుకు పాకిస్థాన్ సెన్సార్ బోర్డు నిరాకరించింది. ఈ సినిమాలో ముస్లింలను నేరస్తులు గాను, ఉగ్రవాదులుగాను చిత్రీకరించారని, అందువల్ల ఇస్లాం మతాన్ని కించపరిచే సినిమాకు పాక్‌లో చోటు లేదని స్పష్టం చేసింది. రయీస్ సినిమాలో హీరో షారుక్ ఖాన్ గుజరాత్‌లో మద్యనిషేధం ఉన్నా దొంగతనంగా సారా, మద్యం అమ్ముతుంటాడు. చివర్లో డబ్బు అవసరమై బంగారం స్మగ్లింగ్ చేస్తున్నాననుకుని ఆర్డీఎక్స్‌ను స్మగ్లింగ్ మార్గంలో భారతదేశంలోకి తీసుకొస్తాడు. దాంతో ఉగ్రవాదులు జరిపే పేలుళ్లలో వెయ్యిమందికి పైగా మరణిస్తారు. ఈ కథ నేపథ్యంలోనే పాకిస్థాన్ ఈ సినిమాను నిషేధించడంతో సినిమా కలెక్షన్లకు కొంత దెబ్బ పడే అవకాశం కనిపిస్తోంది.
గత సంవత్సరం భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి కళాకారులు నటించిన సినిమాలను భారతదేశంలో ఆడనిచ్చేది లేదంటూ కొన్ని పార్టీలు హుకుం జారీ చేయడంతో పాకిస్థాన్‌లో బాలీవుడ్ సినిమాలను నిషేధించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తేసింది. అయినా ఇప్పుడు సినిమా కథ.. కథనం నేపథ్యంలో రయీస్‌ను అక్కడ నిషేధించారు. అయితే, ఇప్పటికే సినిమా పైరేటెడ్ సీడీలు పాకిస్థాన్ మార్కెట్లోకి విస్తృతంగా వెళ్లిపోయాయి. స్థానిక కేబుల్ ఆపరేటర్లు కూడా ఈ సినిమాను తరచు టీవీలలో ప్రదర్శిస్తూనే ఉన్నారు. దాంతో ప్రేక్షకులు మాత్రం సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.
Advertisement
Advertisement