చాలా మంది అనుకుంటుంటారు మన పిల్లలు మన బాధ్యత అని. కానీ కేవలం బాధ్యత కాదు అంటున్నారు షారుక్. మరేంటి? అంటే... మన సామర్థ్యానికి కొలమానం అట. పేరెంటింగ్ (పిల్లల పెంపకం) గురించి షారుక్ తన ట్వీటర్ అకౌంట్‌లో రాసుకొస్తూ – ‘‘మన పిల్లలు మన రెస్పాన్సిబులిటీ (బాధ్యత) కాదు. మన సామర్థ్యానికి కొలమానం. కొంత మంది ఎప్పుడూ ‘మా పిల్లలు అల్లరి చేస్తూ బాగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు’ అని ఫిర్యాదు చేస్తుంటారు.
కానీ నేనేమంటానంటే.. దాన్ని అలా చూడకుండా ఆ ఇష్యూస్‌ని మన సామర్థ్యానికి పరీక్ష లాగా భావించాలి. ఆ అల్లరి ఎందుకు చేస్తున్నారు? తిరిగి అల్లరి చేయకుండా మనం ఏం చేయాలి? అనేది మన కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. అంతే కానీ పిల్లలని నిందించడం సరి కాదు. మనకి ఉన్న ఎనర్జీ కంటే మనం ఇంకా ఎక్కువ చేయగలం అని చెప్పడానికి అదో టెస్ట్. మన పిల్లలు మన సామర్థ్యం అవ్వాలి కానీ మన బాధ్యత మాత్రమే కాదు’’ అని పేరెంటింగ్ టిప్స్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment