ఈ హీరో కూతురుకు భలే పేరుపెట్టాడు | Shahid Kapoor, Mira have an adorable name for their daughter | Sakshi
Sakshi News home page

ఈ హీరో కూతురుకు భలే పేరుపెట్టాడు

Published Mon, Sep 19 2016 12:15 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

ఈ హీరో కూతురుకు భలే పేరుపెట్టాడు

ఈ హీరో కూతురుకు భలే పేరుపెట్టాడు

ముంబై: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, మీరా దంపతులు తమ ఇద్దరి పేర్లు కలసి వచ్చేలా వారి ముద్దుల కూతురుకు ఓ పెట్టారు. మీరా, షాహిద్ పేర్లలోని తొలి అక్షరాలను కలిపి పాపకు మిషా అనే పేరు పెట్టారు.

గత నెల 28న మీరా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత షాహిద్ చిన్నారిని తన చేతులపై ఎత్తుకుని భార్యను ఇంటికి తీసుకెళ్తున్నప్పటి ఫొటో సోషల్ మీడియాలో వచ్చింది.  ఇటీవల షాహిద్ దంపతులు పాపను అమృత్సర్కు తీసుకెళ్లి ఓ గురువు దగ్గర ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే పాపకు ఏ పేరు పెట్టాలని ఆయన్ను సలహా కోరారు. ఇక షాహిద్ అభిమానులు కూడా తమ హీరో కూతురికి ఏ పేరు పెట్టారో తెలుసుకోవాలని ఆసక్తి చూపారు. మిషా పేరు బాగుందని, తల్లిదండ్రుల మాదిరే పాప అందంగా ఉందని అభిమానులు ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement