
బాహుబలి స్థాయిలో షారూఖ్ సినిమా..!
ప్రాంతీయ చిత్రంగా తెరకెక్కి అంతర్జాతీయ స్థాయి సంచలనాలు నమోదు చేస్తున్న బాహుబలి 2, ఎంతో మంది ఫిలింమేకర్స్కు
ప్రాంతీయ చిత్రంగా తెరకెక్కి అంతర్జాతీయ స్థాయి సంచలనాలు నమోదు చేస్తున్న బాహుబలి 2, ఎంతో మంది ఫిలింమేకర్స్కు ధైర్యానిచ్చింది. ఇప్పటి వరకు భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించేందుకు ఆలోచిస్తున్న నిర్మాతలు ఇప్పుడు ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూడా త్వరలో ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
బాహుబలి సాధించిన విజయంతో షాక్ తీన్న బాలీవుడ్ ఇండస్ట్రీ, ఇప్పడిప్పుడే తేరుకుంటోంది. బాహుబలి స్థాయి సినిమాను తెరకెక్కించేందుకు అక్కడి దర్శక నిర్మాతలు, హీరోలు ముందుకు వస్తున్నారు. అందులో భాగం సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, పశ్చిమ ఆఫ్రికాలో ఇండియన్ ఆర్మీ చేసిన ఓ సక్సెస్ ఫుల్ రెస్క్యూ ఆపరేషన్ నేపథ్యంలో.. భారీ బడ్జెట్తో ఆపరేషన్ ఖుక్రి సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది.
షారూఖ్, ఈ సినిమా చేయాలని చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నా, అంత బడ్జెట్ వర్క్ అవుట్ అవుతుందో లేదో అన్న ఆలోచనతో వెనకడుగు వేశాడు. అయితే బాహుబలి ఇచ్చిన ధైర్యంతో త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడట. షారూఖ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఆఫ్రికాలో రెస్క్యూ ఆపరేషన్ జరిగిన ప్రాంతంలోనే షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.