శర్వానంద్‌కు డబుల్ హ్యాట్రిక్ దక్కాలి
నిర్మాత ‘దిల్ ’రాజు
‘‘విజయవాడ తెలుగు సినిమాలకు పుట్టినిల్లు. ఎన్టీఆర్‌గారు, నాగేశ్వరరావుగారు ఇండస్ట్రీకి ఇక్కడి నుంచి వెళ్లినవారే. తెలుగు సినిమా ఘనత అంతర్జాతీయ స్థాయికి చేరింది. బ్యాగ్రౌండ్ లేకుండా పేరు తెచ్చుకున్న శర్వానంద్‌కు కంగ్రాట్స్’’ అని అన్నారు ఎంపీ కేశినేని నాని. శర్వానంద్, లావణ్యా త్రిపాఠి జంటగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో భోగవల్లి బాపినీడు నిర్మించిన ‘రాధ’ ప్రీ–రిలీజ్ వేడుక విజయవాడలో జరిగింది. చంద్రమోహన్ దర్శకుడు. రథన్ సంగీత దర్శకడు. ఎంపీ కేశినేని నాని చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘అప్పట్లో కృష్ణుడు చక్రం తిప్పితే.. ఈ కృష్ణుడు లాఠీ తిప్పుతాడు’’ అని దర్శకుడు అన్నారు.
‘‘రథన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ‘రాధ’ సినిమాతో శర్వానంద్ ఐదో హిట్ సాధించి, ఇదే ఏడాది సెకండ్ హ్యాట్రిక్ అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘మా అబ్బాయి పూర్తి స్థాయి నిర్మాతగా చేసిన ఈ సినిమా హిట్టవ్వాలి. ఈ నెల 12న సినిమాని రిలీజ్ చేస్తున్నాం’’ అని బీవీయస్‌యన్ ప్రసాద్ అన్నారు.