జోడీ కుదిరింది! | Sharwanand next movie with Chandra Mohan cintada | Sakshi
Sakshi News home page

జోడీ కుదిరింది!

Published Sun, May 8 2016 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

జోడీ కుదిరింది!

జోడీ కుదిరింది!

‘రన్ రాజా రన్’తో దర్శకుడు సుజిత్‌కు బ్రేక్ ఇచ్చిన శర్వానంద్ మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు. ‘డార్లింగ్’ చిత్రానికి దర్శకుడు కరుణాకరన్ దగ్గర పనిచేసిన చంద్రమోహన్ చింతాడ చెప్పిన కథ నచ్చి, ఆయన దర్శకత్వంలో నటించడానికి అంగీకరించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై భోగవల్లి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘అందాల రాక్షసి’తో మంచి పేరు తెచ్చుకుని, సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్న లావణ్యా త్రిపాఠి ఈ చిత్రంలో కథానాయిక. ‘‘జూన్ 1న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మిగతా నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: భోగవల్లి బాపినీడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement