జెంటిల్మన్.., శర్వా చేయాల్సిందా..? | Sharwanand was first choice for Gentleman | Sakshi
Sakshi News home page

జెంటిల్మన్.., శర్వా చేయాల్సిందా..?

Published Tue, Jun 21 2016 2:52 PM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

జెంటిల్మన్.., శర్వా చేయాల్సిందా..?

జెంటిల్మన్.., శర్వా చేయాల్సిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సి సినిమా మరో హీరో దగ్గరకు వెళ్లటంతో తరువాత అది మంచి సక్సెస్ సాధించటంతో గతంలో కాదన్న హీరో బాధ పడటం చాలా కామన్. తాజాగా జెంటిల్మన్ సినిమా విషయంలోనూ అదే జరిగింది. నాని హీరోగా తెరకెక్కిన జెంటిల్మన్ సినిమాను ముందుగా మరో యంగ్ హీరో శర్వానంద్ వినిపించాడట దర్శకుడు. అయితే సినిమాలో హీరో పాత్రకు నెగెటివ్ షేడ్స్ ఎక్కువగా ఉన్నాయన్న ఆలోచనతో శర్వా, జెంటిల్మన్ ప్రాజెక్ట్ కు నో చెప్పాడు.

ప్రస్తుతం కామెడీ టచ్ ఉన్న పాత్రలు చేస్తున్న శర్వానంద్, కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా సీరియస్ పాత్రలన్లోనే నటించాడు. అందుకే జెంటిల్మన్ సినిమాలో నెగెటివ్ టచ్ ఉన్న పాత్రకు శర్వా అయితే కరెక్ట్ అని ఫీల్ అయ్యారు చిత్రయూనిట్. కానీ శర్వా మాత్రం కామెడీ జానరే సేఫ్ అని ఇంద్రగంటికి నో చెప్పాడు. అలా ఓ యంగ్ హీరో కాదన్న కథ, నాని ఖాతాలో హిట్ సినిమాగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement